పఠనీయం

తెలంగాణ అస్తిత్వ పోరాటం నీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ కథ నవల
-బి.ఎస్.రాములు
(రాష్ట్ర బి.సి.కమిషన్ చైర్మన్)
రాష్ట్ర బి.సి.కమిషన్ చైర్మన్‌గా ఉన్న బి.ఎస్.రాములు (బేతి శ్రీరాములు) సామాజిక తత్వవేత్త. 175కు పైగా నవలలు, కథలు ఆయన కలం నుండి జాలు వారాయి. గతి తర్క తత్వ దర్శన భూమిక, అంబేడ్కర్ సోషలిజం, గతితర్కం అంబేడ్కరిజం మార్క్సిజం, బహుజన తత్వం, సమగ్ర వ్యక్తిత్వ వికాసం, జీవితం అంటే ఏమిటి, సామాజిక న్యాయం, తెలంగాణ కథకుల జీవన రీతులు, లీడర్‌షిప్, భారతీయ చరిత్ర శూద్ర దృక్పదం, బీసీలు ఏం చేయాలి తదితర తాత్విక గ్రంథ రచనలకు జీవం పోసారు. 250కి పైగా గ్రంథాలకు పీఠికలు, 95దాకా విభిన్న ప్రక్రియలలో గ్రంథాలను ఆవిష్కరించారు. 1982లో బతుకు పోరు నవల, 1991లో పాలు, 1997లో స్మృతి, 2000లో మమతలు-మానవ సంబంధాలు తదితర వైవిధ్య భరిత అంశాలను అక్షరబద్దం చేశారు. పాలు కథల సంపుటి ఆంధ్ర, కాకతీయ విశ్వవిద్యాలయాలలో ఎం.ఏ.లో పాఠ్యాంశంగా ఉంది. 1992లో ఆంధ్ర ప్రదేశ్ రచయితల, కళాకారుల, మేధావుల, ఐక్యవేదిక వ్యవస్థాపకులు...ప్రాంతీయ అస్తిత్వం తెలంగాణ కథ నవల అనే సంకలన గ్రంథాన్ని తమ 50ఏళ్ళ సాహిత్య స్వర్ణోత్సవాల గుర్తుగా ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2017లో విశాల సాహిత్య అకాడమీ ద్వారా ప్రచురించారు. మహా రచయితలు మాక్సిం గోర్కీ, మున్షీ ప్రేంచంద్, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్‌బాబు తనకు ఆదర్శమంటారాయన. వారి వారసత్వాన్ని స్వీకరించి, సమాజ పరిణామాలు చిత్రించడమే తమ కథా, నవల వస్తువు, ఇతివృత్తంగా రచనలు చేస్తున్నారు రాములు. పాలితుల జీవితాలను లేదా వెనకబడిన ప్రజల జీవితాలను, ప్రాంతీయ స్పృహగా నిరాకరించడం వల్ల సంబంధీకుల అస్తిత్వ పోరాటాలు, ప్రాంతీయ స్పృహ పరస్పర సంబంధాలలో బి.ఎస్.రాములు లోతుగా ఈ సంకలనంలో పరిశీలించి, అధ్యయనం చేశారు. తెలుగు ప్రాంతం అంతా ఒకటే అయినా, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, విద్య, అధికార, కుల, మత, దృక్పదాల, స్థల కాలాల, వృత్తుల, అభివృద్ధి అందుకున్న తీరుల ఆధారంగా ప్రాంతీయ జీవన ప్రమాణాలు, చైతన్యం వైవిధ్యాలను కలిగి ఉండే పరిస్థితులను సోదాహరణంగా వివరించారు. బ్రిటిషాంధ్ర ప్రాంతీయ అస్తిత్వ చేతన, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం, అస్తిత్వ వాదాలు, సాహిత్యం - దృక్పదం, తెలంగాణ సాహిత్యంలో ప్రాంతీయ అస్తిత్వ చిత్రణ, తెలంగాణ ఉద్యమ ప్రాంతీయ చైతన్యం, చేతన, కుల సంస్కృతికి పరిమితమైన స్తల కాల ప్రాంతీయ అస్తిత్వ చిత్రణ, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం జిల్లాల వారీగా సంకలనాల ఆవశ్యకత, తెలంగాణ నవల పరిధి - పరిమితి, తెలంగాణ తొలి నవలలు, సాహిత్య సంఘాల ప్రాధాన్యత, తెలంగాణ ఉద్యమ నవలలు, తెలంగాణ చారిత్రక నవలలు తదితర విభాగాలతో కథ, నవలల గురించి అంశాల వారీగా విశే్లషించారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494