కథ

పడమటి గది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూర్ రైల్వేస్టేషన్ నండి అద్దెకారు పరుగులు తీస్తోంది. అల్లూరు రోడ్ లోకి మలుపు తిరిగింది. రెండు కిలోమీటర్ల తరువాత విశాలమైన ఒక భవంతి ముందు ఆగిం.
‘‘ఇదేనమ్మా!దయానిధి ప్రజావైద్యశాల’’ అన్నాడు డ్రైవర్.
బాలామణి తల వూపి ‘సరే’ అంది
వెనక సీట్లో ఆమె కూర్చుని ఉంది. ఆమె ఒడిలో ఒక సాధువు పడుకుని ఉన్నాడు. నిజానితకు స్పృహ లేని స్థితిలో ఉన్నాడు.
‘స్ట్రెచర్ తీసుకుని రమ్మని చెప్పరూ’’ అంది బాలామణి.
డోరు తెరుచుకుని డ్రైవర్ కిందికి దిగి ఆసుపత్రి లోనికి పరుగులు తీశాడు. ఆమెనూ, సాధువునూ చూస్తోంటే అతడికి ముచ్చటగా ఉంది. తన కష్టమర్ల మీద అభిమానం పెంచుకున్నాడతడు.
నిమిషాల్లో స్ట్రెచర్ రావడం, సాధువును దానిమీదకు చేర్చి ఆసుపత్రి సిబ్బంది వేగంగా భవంతిలోనికి తీసుకు పోవడం జరిగిపోయాయి. డ్రైవర్ కు ధన్యవాదాలు తెలిపి, బాడుగ చెల్లించి అద్దెకారును పంపించి వేసింది బాలా మణి. తరువాత ఆసుపత్రి రిసెప్షన్ కౌంటర్ వద్దకు చేరుకుంది.
‘‘సాధువుగారిని ఎక్కడకు తీసుకు వెళ్లారు?’’ అంది బాలామణి
‘‘అత్యవసర చికిత్స, ఎడమకాలికి అంత పెద్ద గాయం ఎలా అయ్యింది? ’’ రిసెప్షన్ లో కూర్చున్న వైద్య విద్యార్థిని అడిగింది. ఆమె ప్రక్కన ఒక సీనియర్ నర్స్ నిలబడి ఉంది.
‘కావలి దాటుతూ ఉండగా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. కాళ్లూ చేతులు విరిగిన వాళ్లనూ, ప్రాణాలు పోయినవాళ్లనూ అంబులెన్సులో పభుత్వ ఆసుపత్రికి తీసుకువెల్లారు. తక్కువ గాయాలతో బయట పడిన వారిలో ఈయన ఉన్నారు. నేను కూడా గాయాల నుండి తప్పించుకున్నాను.ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి మమ్మల్ని నెల్లూరు చేర్చారు.’అంది బాలామణి.
‘‘మీ స్వంత బాధ్యత మీద సాథువుగారిని ఇక్కడికి తీసుకుని వచ్చారన్నమాట’’అడిగింది వైద్య విద్యార్థిని .
‘అవును. ఆయన వెంట ఎవరూలేరు’
‘సాధువుగారి పేరు చెప్పండి. ఆయనకు చికిత్స మొదలైంది’
‘ఆయన పేరు నాకు తెలియదు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు’
ఆశ్చర్యంగా చూసింది నర్సు.
బాలామణికి తండ్రి వదిలిపెట్టి పోయిన ఆస్తి చాలా ఉంది. ఇటువంటి వర్చస్సు కలిగిన సాధువు ఆధ్వర్యంలో ఒక ఆసుపత్రిని , ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాలని ఆమె ఉద్దేశం. సాధువు ప్రయాణిస్తున్న రైలులోనే అనుకోకుండా ఆమె కూడా ప్రయాణించింది. సాధువు ఆమెను బాగా ఆకర్షించారు.
బాలామణి పట్ల వైద్య విద్యార్థినికీ, నర్సుకీ ఆసక్తి ఆశ్చర్యం పెరిగాయి. ఎటువంటి అంచూ లేని తెల్లచీర ధరించిందామె. చేతులూ, చెవులూ బోడిగా ఉన్నాయి. మణికట్టు వరకూ ఉన్నాయి రవిక చేతులు. స్వచ్ఛంగా మంచులో తడిసిన మల్లెపూవులా ఉంది ఆమె.
సాధవుకు కాలి ఎముక విరగలేదు. కండరం తెగి ఎముక మీద గీత పడింది. గాయానికి కుట్లు వేశారు. కానీ తల లోపలి భాగంలో చిన్న మెదడు కదలడం వల్ల ఆయనకింకా స్పృహ రాలేదు. బెడ్ వద్దనే నిలబడి ఉన్నారు వైద్య విద్యార్థినీ, బాలామణి.
‘ఆయనిది ఏ ఊరో , బంధువులు ఎక్కడుంటారో ఎలా తెలుస్తుంది? ఆయన వద్ద ఉన్న వస్తువుల్లో, బట్టల్లో, పుస్తకాలల్లో ..’’అర్థోక్తిలో ఆగిపోయింది వైద్య విద్యార్థిని.
‘‘ప్రమాదం జరిగింది. అంతా అస్తవ్యస్థంగా మారింది. కొంతమందికి శరీరాల్లోనికి లోహపు రేకులు, ప్లాస్టిక్ షీట్స్ వంటివి దిగబడ్డాయి. బోగీలు ఒక ప్రక్కకు ఒరిగిపోయాయి. సామానులు ఇరుకు భాగాల్లోకి జారుకున్నాయి. భుజానికి వ్రేలాడే సంచి మాత్రమే ఆయన వద్ద చూశాను’’ అంది బాలామణి.
మూలుగు వినిపించింది. సాధువు నెమ్మదిగా కదిలాడు. అంతే తప్ప ఆయన కళ్ళు తెరవలేదు.
‘‘నాన్నగారు ఇంటికి రావాలని లేదు నాకు. అక్కడ పడమటి గది ఉంది. ఆ గదిలోకి చేరిన మనిషి ఇక వెనక్కిరాడు. ముత్తాతను చూశాను. తాతయ్యను చూశాను. ఒకనాటికి మీరూ ఆ తర్వాత నేనూ అక్కడకు చేరుకుంటాము.అటు నుంచి అటే వాకిట్లోకి వాకిట్లోంచి....’’ ఒక్కొక్క మాట మాట్లాడుతూ కలవరించడం ఆపాడు సాధువు. ఇదంతా కలవరించేటపపటికి దాదాపు పది నిముషాలకు పైగానే సమయం తీసుకున్నాడాయన.
కనిపించడానికి అరవై ఏళ్ల వృద్ధుడే కానీ ఆయన గొంతులో యవ్వనపు ఛాయ ఉంది.
ఆయనను కుదిపింది వైద్యవిద్యార్థిని.
‘‘అయ్యా! తమది ఏ ఊరు? మీ నాన్నగారి పేరు? మీ వివరాలు చెప్తారా? వారికి సమాచారం అందిస్తాం’’
సాధువు మాట్లాడలేదు. తిరిగి మగత నిద్ర కమ్మేసింది ఆయన్ను.
‘తినడానికి మీకు ఆహారం ఏర్పాడు చేస్తాను ’అంది వైద్యవిద్యార్థిని
తనహేండ్ బేగ్ నుండి నోట్ల కట్టతీసి ఆమెకు అందించబోయింది బాలామణి. ‘‘సాధువుగారి వైద్యం నిమిత్తం డబ్బును ధరావత్తుగా ఉంచుకోండి.’’కోరింది ఆమె
వైద్యవిద్యార్థి నవ్వి ‘‘మీరు డబ్బు చెల్లించవలసిన పనే ఉంటే అది చెల్లించాకనే ట్రీట్‌మెంట్ మొదలై ఉండేది. ఈ ఆసుపత్రి దయానిధిరావు గారి ధర్మం మీద నెలకొల్పారు. వారికి ఉన్న వందలాది ఎకరాల మాగాణి పొలం మీద వచ్చే ఆదాయాన్ని ఖర్చుపెట్టి ఇటువంటి ఆసుపత్రులు కట్టించారు కుటుంబ సభ్యులు. అత్యవసర చికిత్స నిమిత్తం ఈ ఆసుపత్రిలో ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకా గర్భిణీలకు, పిల్లలకు వేరే చోట్ల నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి’’ అంది
‘‘అలాగా , దయానిధిరావుగారు ఎవరు’’అందిబాలామణి
‘‘రెడ్డిపాలెం వత్సవాయి వంశం వారి వారసుడు. వారి వంశంలోనే బుచ్చి సీతారామమ్మ గారి పేర అన్నసత్రం ఒకటి నడుస్తున్నది. పాఠశాల విద్యార్థులకు రెండు పూటల అన్నం పెడతారు. అత డెబ్బై ఎనబై సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమం జరుగుతోంది. అలాగే దయానిధిరావు గారి పేరు మీద ఆసుప్రతులునూ’’ అంది వైద్య విద్యార్థిని.
బాలామణికి కళ్లు చెమర్చాయి. సమాజంలో ఇంత ఉదాత్తమైన వ్యక్తులు ఉన్నారా? అన్నసత్రం కోసం వందల ఎకరాల ఫలసాయాన్ని పేద బిడ్డల కోసం ఖర్చుపెట్టేవారు ఉన్నారా? అలాగే ఆసుపత్రులూ, దశాబ్దాల తరబడి ఎన్ని లక్షల మంది ఈ వంశం వారి సేవలందుకుని ఎంతగా ఋణపడి ఉన్నారో!
‘‘ఇలాంటి ఆసుపత్రుల నిర్వహణకు కుమార వర్మగారిని నియమించారు. ఆయన కూడా వత్సవాయి వంశంవారే దాయాదులు. ఎనభై అయిదేళ్ల వృద్ధుడు. అయితేనేం. యువకుడు కూడా ఆయన అందించే సేవల దగ్గర పనికిరాదు. ఇక్కడకు ఆయన ఈక్షణమో మరుక్షణమో వస్తారు. ’’ అంది సిస్టర్
‘‘అదిగో .. చాకలివాళ్లు, మంత్రాలు చదివే పురోహితులూ, పాడె కట్టేవాళ్లు, కాటికాపిరి .. వీళ్లంతా అప్పుడే ఎందుకు వచ్చారు? .. మరణశయ్యంపై చావును ఆహ్వానిస్తూ వద్దు.. వద్దు’’ కలవరిస్తున్నాడు సాధువు.
కుమారవర్మ గారు రానె వచ్చారు. సాధువుని నఖశిఖ పర్యంతమూ నిశితంగా చూసారు. సాధువుని గుర్తుపట్డిన వర్మగారు ‘‘అబ్బాయి గారు’’ అన్నారు. ఆయన ముఖంలో ఆశ్చర్యంతో పాటు ఆనందం చూసింది బాలామణి.
‘‘అంటే’’ ప్రశ్నార్థకంగా ఆగింది ఆమె. ‘‘వీరే దయానిధి. ఈ ఆసుపత్రి వారిదే’’ అని నిట్టూర్చి, ‘‘మా వంశంలో అకాల మరణాలు లేవు. అయితే వృద్ధాప్య సమస్యలతో కాటికి కాళ్లు చాపుకున్న ఇంటి పెద్దను తూర్పు గదుల నుంచి పడమటి గదిలోకి మార్చటం మా ఆచారమూ, ఆనవాయితీనూ. ఆ సంప్రదాయానికి భయపడో , ఇష్టం లేకనో అబ్బాయి గారు పదహారో ఏటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మేము వెతకని చోటు లేదు’’ కుమారవర్మ చెప్పడం ఆపాడు.
‘‘నెక్రఫోబియా’’ అప్రయత్నంగా అనుకుంది బాలామణి.
వెంటనే బాలామణికి సాధువు రైలు ప్రయాణంలో చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. ఆయన దేశం మొత్తం తిరిగారు. ఋషికేష్ వంటి పుణ్య స్థలాల్లో కొంత కాలంపాటు తపస్సులో కూర్చున్నాడు. గయ, ప్రయాగ తదితర ఉత్తరాది క్షేత్రాలు ముగించిన తర్వాత దక్షిణాది క్షేత్రాలైన శ్రీశైలం,కంచి, మధురై, కన్యాకుమారి వంటి ప్రదేశాలకు పర్యటన మొదలుపెట్టాడు. ఇదంతా కుమారవర్మకు చెప్పింది.
తన దాతృత్వ విశేషంతో ఏర్పడిన ఆసుపత్రిలో తనకే తెలియకుండా తన ప్రమేయం ఏమీ లేకుండా ఈదయానిధి చేరడటం బాలామణికి చిత్రంగా తోచింది.
***
డాక్టర్లు లాభం లేదన్నారు. వత్సవాయి కుటుంబీకులకు అతి కష్టం మీద దయానిధి రావు ఉనికి గురించి కుమారవర్మ కబురు చేరవేశాడు. వంశస్థులందరూ ఇక్కడా అక్కడా చెదిరిపోయి ఉన్నరు. ఇరవై నాలుగు గంటల తర్వాత గానీ వాళ్లు సర్వజన ఆసుపత్రికి చేరుకోలేకపోయారు. తండ్రి మాత్రం అక్కడికిచేరుకోలేదు.
తండ్రి రెడ్డిపాలెంలో హవేలీ లోనే ఉండిపోయాడు. ఎనబై దాటిన వయస్సులో రకరకాల వృద్ధాప్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడాయన. పడమటి అదిలో పడుకోబెట్టారు ఆయనని. ఆయన వెంట కొంతమంది బంధువులు ఉన్నారు. ఉదయం నుండీ ఆయనకు స్పృహ లేదు. వాకిట్లోనికి అప్పటికే అంతిమ యాత్రా నిర్వాహకులు ఒక్కరొక్కరుగా చేరిపోతున్నారు. సరంజామా కూడా చేరిపోతోంది.
ఒక్కసారిగా పడమటి గదిలోంచి శోకాలు వెలువడ్డాయి. నిర్వాహకులు తాము ఎటువంటి పడిగాపులు కాయడమే వారి పనైంది. అంతిమ యాత్ర ముగిసింది. అదే సమయానికి వీధిలో ఒక వాహనం ఆగింది. అని ఊరంతా అప్పుడే తెలిసింది ఊరి జనంతో పాటు చుట్టు పక్క ల పల్లెల్లోని వారు మళ్ల హవేలి వైపు పరుగులు తీశారు.
***
నివాసితులు రోగాల బారిన పడకుండా వాస్తు ప్రకారమో , శాస్త్ర సమ్మతంగానో పూర్వీకులు కట్టించిన విశాలమైన హవేలీలో చాలా తక్కువ మంది బంధువులు ఇద్దరు సేవకులు మాత్రమే ఉండడంతో ఎక్కువ గదులు నిరుపయోగంగా మిగిలిపోయాయి. బాలామణి అంది, ‘‘ గది ఖాళీగా ఉంది. వీరికి అది ఎంతో అనువుగా కూడా ఉంటుంది.’’
‘‘అదేనమ్మా పడమటి గది’’ కుమారవర్మ గంభీరంగా పలికాడు.
దయానిధిరావుకు స్పృహ వస్తోంది. పోతోంది. అదిగో అటువంటి సమయంలోనే వారిద్దరి మాటలు ఆయన చెవుల్లో గింగిరుమన్నాయి. మరుగున పడిపోయిన బాల్యస్మృతులు ఆ అపస్మారక స్థితిలో వరదగా పొంగి పొరలుతున్నాయి.
‘వద్దు. పడమటి గదిలో నన్ను పడుకోబెట్టవద్దు. అప్పుడే వెదురు కర్రలు తెచ్చారా? అదిగో నిప్పుల కుండ సిద్ధంగా ఉంది. కట్టెల మోపులు! పూలదండలు ! అగరు వత్తులు. చందనపు పూతలు... ఈ అంత్యదశ సేవలు... ఆ అవసాన దశ... ఎదురుచూపులు .. నాకు వద్దు ... అది మంచం కాదు. ముళ్లకంప. అంపశయ్య. ...’’ పలవరింతలు ఆగిపోయాయి.
దయానిధికి తాను ఎటో జారిపోతున్నట్టు ఒక భావన. తల తిరుగుతోంది ఆయనకు. ఈ గదికి భయపడి ఎంతో దూరం పారిపోయాడు. వేలాది మైళ్ల దూరం సాగిపోయాడు. అయితేనేం, కాలప్రవాహంలో కొట్టుకుపోయి ఇక్కడికే తిరిగి వచ్చాడు. దీని వెనుక ఏదైనా ప్రయోజనం ఆశించాడా ఆ పరాత్పరుడు.
‘ఏమో ! మానవ జీవితం ఎటు తిరిగి, ఎటు ప్రయాణించి చివరకు ఎటు చేరుకుంటుందో! మానవాతీత శకి లేకుండానే ఇదంతా జరుగుతుందా?’’ బాలామణి ఆలోచిస్తోంది.
ఒక్కసారి దయానిధి కళ్ళు తెరిచి మస్తిష్కంలో శూన్యమే.
కాసేపట్లో ఇది నిర్జీవం. వాకిట్లో నిర్వాహకుల సందడి మొదలైంది. జంగమ దేవర వంఖం పూరించాడు.
‘‘దయానిధి తన ఇంటితో ఉన్న బంధంతో ఇక్కడికి చేరాడు. మరి ఈయనతో నా బాదరాయణ సంబంధం ఏమిటి?’’ బాలామణి వౌనంగా దయానిధి దేహానే్న చూస్తూ పడమటి గదిలో కూర్చుని ఉంది. నిర్లిప్తంగా అవ్యక్తమైన భావనతో...
*

మేడా మస్తాన్ రెడ్డి 9441344365