కథా సాగరం

సాదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాదీ గొప్ప కవి. ఆయన తన జీవితంలోని ఒక సంఘటన గురించి రాసుకున్నాడు. ఓసారి నాకు చెప్పుల్లేవు. వేడి యిసుకలో చెప్పుల్లేకుండా నడవాల్సి వచ్చేది. నేనెంత దురదృష్టవంతుణ్ణి అని దిగులుపడ్డాను. అప్పుడు ఒక కుంటివాణ్ణి చూశాను. అతనికి ఒక కాలు లేదు. శ్రమపడుతూ నడుస్తున్నాడు. నేను మోకరిల్లి ఆకాశం కేసి చూసి ‘్భగవంతుడా! కనీసం నాకు కాళ్లిచ్చావు’ అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను’ అన్నాడు.
ఒకరోజు సాదీ ఒక పుస్తకాల షాపులో కూర్చున్నాడు. ఆ రోజు ఆ పుస్తకాల షాపు యజమాని లేడు. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ‘సాదీ పుస్తకాలు వున్నాయా?’ అని అడిగాడు. అక్కడ వున్నది సాదీ అని వచ్చిన వ్యక్తికి తెలీదు.
సాదీ అతన్తో ‘నీకు సాదీ పుస్తకాలు ఎందుకని నచ్చుతాయి?’ అని అడిగాడు. దానికతను ‘అతను ఉల్లాసకరమయిన మనిషి. నవ్వు పుట్టిస్తాడు’ అన్నాడు. సాదీ తన పుస్తకాలన్నీ అతనికి యిచ్చాడు. అతను డబ్బు చెల్లించబోయాడు. దానికి సాదీ ‘నేనే సాదీని. నువ్వు నన్ను నవ్వు పుట్టించే మనిషని అన్నప్పుడే నా పుస్తకాల ఖరీదు చెల్లించావు. నువ్వేమీ యివ్వనక్కరలేదు. పుస్తకాలు తీసుకో’ అన్నాడు.

- సౌభాగ్య, 9848157909