తెలంగాణ

కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధిపేట: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారంనాడు తన ఇష్ట దైవమైన కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనే కాదు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసే ముందు కూడా కేసీఆర్ వెంకన్నను దర్శించుకోవటం ఆనవాయితీ. ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో ఆయన వెంకన్నను దర్శించుకోవటానికి వచ్చారు. కేసీఆర్‌కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న కేసీఆర్ నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల చెంత వుంచారు. ఆయనతో పాటు హరీష్‌రావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తాను ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు ఇక్కడే ఉంటాయని అన్నారు.