తెలంగాణ

కెసిఆర్ పర్యటన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వల్ప అస్వస్థతే కారణం: సిఎంఓ

హైదరాబాద్, ఫిబ్రవరి 19: వరంగల్ జిల్లాలో శుక్రవారం జరగాల్సిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పర్యటన రద్దు అయింది. ముఖ్యమంత్రికి స్వల్ప అస్వస్థత కారణంగా వరంగల్ జిల్లా పర్యటన రద్దు అయినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వరంగల్ జిల్లా మేడారంలో గత మూడు రోజులుగా జరుగుతున్న జాతరను పురస్కరించుకుని సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి శుక్రవారం అక్కడికి వెళ్లాల్సి ఉంది. అలాగే వరంగల్‌లోని మడికొండ సెజ్‌లో ఏర్పాటు చేయనున్న ఐటీ ఇంక్యూబేషన్ టవర్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో టవర్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు నిర్వహించారు.