క్రీడాభూమి

ఆజాద్‌కు సిఎస్‌ఐ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 24: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పించి, బిజెపి నుంచి సస్పెన్షన్‌కు గురైన పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్‌కు సంపూర్ణ మద్దతును ఇవ్వాలని క్లీన్ స్పోర్ట్స్ ఇండియా (సిఎస్‌ఐ) నిర్ణయించింది. అవినీతి, కుంభకోణాల రహిత క్రీడల కోసం కృషి చేస్తున్న ఈ సంస్థ ఆజాద్ లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ)లో అవినీతి కుంభకోణం చోటు చేసుకుందని ఆజాద్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఆరోపణలను సమర్థించారు. జైట్లీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై ఆరోపణలు చేశారని, పరిహారంగా పది కోట్ల రూపాయలు చెల్లించాలన్న డిమాండ్‌తో కేజ్రీవాల్ సహా ఆరుగురికి జైట్లీ లాయర్ నోటీసులు పంపారు. వారిలో ఆజాద్ పేరు లేకపోవడం గమనార్హం. అయితే, పార్టీ నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ కేంద్ర మంత్రిపైనే విమర్శలు గుప్పించడం, అవినీతి ఆరోపణలు చేయడాన్ని బిజెపి అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. డిడిసిఎలో జరిగిన అవినీతిపై ఆజాద్ ప్రకటన, ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని సిఎస్‌ఐ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. బిజెపి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. డిడిసిఎలో అవినీతికి వ్యతిరకేంగా గళం విప్పినందుకు ఆజాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. అతనికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ వివాదంపై మాజీ క్రికెటర్లు స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఆజాద్‌కు అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపింది.