రంగారెడ్డి

కీసరగుట్టలో భక్తుల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, నవంబర్ 29: కార్తీక మాసం ఆదివారం కావడంతో కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. వారం రోజుల పాటు వివిధ వత్తిళ్లతో సతమతమైన నగరవాసులు స్వామి వారిని దర్శించుకొని ప్రశాంత వాతావరణంలో సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో పార్కులో గడిపారు. తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి. నగర నలుమూలల నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. యాగశాలలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు గుట్టపైన ఉన్న శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు చేసారు.
గుట్టదిగువ భాగాన గల పార్కులో కుల సంఘాల ఆధ్వర్యంలో వనభోజనాలు చేసారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కాపుసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు.కాపు సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.