కృష్ణ

నేత్రపర్వంగా రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: మహా శివరాత్రి పర్వదిన మహోత్సవాల్లో భాగంగా పాతబస్తీ కెనాల్ రోడ్‌లో మంగళవారం సాయంత్రం వైభవోపేతంగా శ్రీ కన్యకపరమేశ్వరీ అన్నసత్రం కమిటీ అధ్యర్యంలో స్వామి రథోత్సవ ఊరేగింపు మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. తొలుత రథంలో కొలువై ఉన్న దేవతమూర్తులకు ఆయన పూజలు చేశారు. దుర్గ గుడి స్ధానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, శివాలయం ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ సిపితో ప్రత్యేక పూజలు చేయించగా దుర్గ గుడి సహాయ ఇవోలు శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, బి వెంకటరెడ్డి, శ్రీ కన్యకా పరమేశ్వరీ అన్నసత్రం కమిటీ అధ్యక్షుడు బాయన హరేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వల్లంకొండ ప్రసాద్ తదితరులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 4-30 గంటలకు వందలాది మంది భక్తులు హర హర శంభో శంకర ఆంటూ నినాదాలు చేస్తుండగా స్వామి రథోత్సవ ఊరేగింపు బయలుదేరింది. వివిధ రకాల పుష్పాలతో రథాన్ని అలకరించారు. సోమవారం వేకువజాము నుండి వివిధ రకాల అభిషేకాలు చేశారు. పరమేశ్వరునికి సోమవారం రాత్రి వైభవంగా కల్యాణం చేశారు. ఇంద్రకీలాద్రి నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి, పాత శివాలయం నుండి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి, శ్రీ భద్రకాళీ వీరభద్రస్వామి, శ్రీ గంగాపార్వతీ సమేత వసంత మల్లిఖార్జునస్వామి దేవస్థానం నుండి శ్రీ వసంతమల్లిఖార్జున స్వామి, మూడు ఆలయాల నుండి ఉత్సవమూర్తులను ఆలయాల సిబ్బంది ఊరేగింపుగా పాత శివాలయానికి తీసుకొచ్చారు. అక్కడ నుండి ఊరేగింపుగా రథంలో ఉంచారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నుండి సహాయ ఇవోలు శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, బి వెంకటరెడ్డి, పర్యవేక్షణాధికారి కె చంద్రశేఖర్, దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ దుర్గాప్రసాద్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఇవో శిరపరపు హేమలతాదేవి, అర్బన్ అర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొనగళ్ళ విద్యాధరరావు, ఉపాధ్యక్షుడు సూరే సుబ్బారావు, నగరాల దేవస్థానం జాయింట్ సెక్రటరీ పొట్నూరి దుర్గా ప్రసాద్, పసుమర్తి కామేశ్వరశర్మ, శ్రీ గంగాసమేత వసంత మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఇవో నేల సంధ్య, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం ఇవో కెవియన్‌డికె ప్రసాద్, సత్రం కమిటీ అధ్యక్షుడు బయన హరేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వల్లంకొండ ప్రసాద్, పోలీస్ డిసిపిలు అశోక్‌కుమార్, కాళిదాస్, వన్‌టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.