కృష్ణ

యుద్ధప్రాతిపదికన పుష్కర పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: పుష్కర పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం పుష్కరాలకై చేపట్టిన ఏర్పాట్లను సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తొలుత రైల్వేశాఖ ద్వారా చేపట్టిన పనులను సమీక్షించారు. రైల్వే డిఆర్‌ఎం అశోక్‌కుమార్ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికులు వివిధ ఘాట్లకు చేరుకునే వీలుగా ఏర్పాటు చేయనున్న తాత్కాలిక రైల్వేస్టేషన్ల వివరాలను వివరించారు. విశాఖపట్టణం, రాజమండ్రి, ఏలూరు వంటి ప్రధాన నగరాలు నుండి వచ్చే యాత్రికులకు గుణదల రైల్వేస్టేషన్ నుండి దుర్గాఘాట్, పవిత్ర సంగం ఘాట్‌కు, హైదరాబాద్ నుండి వచ్చే యాత్రికులకు రాయనపాడు రైల్వేస్టేషన్ నుండి పవిత్ర సంగం ఘాట్, మచిలీపట్నం, గుడివాడ నుండి వచ్చే యాత్రికులకు రామవరప్పాడు, మధురానగర్ రైల్వేస్టేషన్లు నుండి పవిత్ర సంగం ఘాట్, గుంటుపల్లి, సూరాయపాలెం ఘాట్లకు, గుంటూరు, చెన్నై నుండి వచ్చే యాత్రికులకు తాడేపల్లి రైల్వేస్టేషన్ నుండి దుర్గాఘాట్, కృష్ణవేణి ఘాట్‌లకు యాత్రికులను సులువుగా పంపించే విధంగా రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్‌కు వివరించారు. రైల్వేస్టేషన్ నుండి యాత్రికులను బస్సుల ద్వారా పుష్కరనగర్‌లకు చేరవేసి అక్కడ నుండి సమీప ఘాట్లకు పంపించాలని కలెక్టర్ సూచించారు. రైల్వేస్టేషన్‌లో వైద్య శిబిరం, మరుగుదొడ్లు, తాగునీరు వంటి వౌలిక వసతులు కల్పించాలని రైల్వేశాఖ అధికారులను కలెక్టర్ కోరారు. రైల్వేస్టేషన్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు, అంబులెన్స్‌లు, సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని కలెక్టర్ కోరారు. రహదారులు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.శేషుకుమార్ మాట్లాడుతూ పుష్కర ఘాట్లను కలిపే విధంగా ప్రధాన రహదారుల విస్తరణ, వేదాద్రి నుండి సాగరసంగమం వరకు, జక్కంపూడి నుండి గన్నవరం వరకు, పోలవరం కెనాల్ రోడ్డు, కార్పొరేషన్ పరిధిలో బందరు, ఏలూరు రహదారుల విస్తరణ, నూజివీడు రోడ్డులో లోటస్ పాండ్ నుండి నున్న వరకు, గొల్లపూడి నుండి సితార సెంటర్ వరకు హంసలదీవి నుండి సాగరసంగమంత్మోతులు, విస్తరణకు శాఖాపరమైన అనుమతులతో త్వరితగతిన పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
నీటిపారుదల శాఖ అధికారులు కొత్త ఘాట్ల నిర్మాణానికి, ప్రస్తుత ఘాట్ల మరమ్మతులకు పాలనాపరమైన అనుమతులు పూర్తిచేసి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దుర్గాఘాట్, నీటిపారుదల శాఖ పవిత్ర సంగమం ఘాట్, నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. బ్యారేజి నుండి పున్నమి ఘాట్ వరకు విస్తరించే దుర్గాఘాట్, ఫెర్రి వద్ద పవిత్ర సంగమం ఘాట్‌లను అత్యాధునికంగా మారిటైమ్ సిల్క్ రోడ్డు ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థ డిజైన్ రూపొందించిందని, సంబంధిత బృందంతో అధికారులు సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ నుండి సంగమం ఘాట్ వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ, ఇబ్రహీంపట్నం వద్ద తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పైలాన్ ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. నదుల అనుసంధానం వద్ద చిహ్నంగా మాన్యుమెంట్ ఏర్పాటుచేయాలని కోరారు. బస్టాండ్ నుండి పుష్కరనగర్‌లకు సర్వీసు బస్సులు, పుష్కర నగర్ నుండి ఘాట్లకు మినీ బస్సులు ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ, హైదరాబాద్, జగ్గయ్యపేట నుంచి వచ్చే యాత్రికులకు జాకీర్ హుస్సేన్ కళాశాల గ్రౌండ్, హైదరాబాద్, ఖమ్మం నుంచి వచ్చే యాత్రికులు ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్, తిరువూరు, మైలవరం, ఖమ్మం నుంచి వచ్చే యాత్రికులకు విటిపిఎస్ కళాశాల గ్రౌండ్, మచిలీపట్నం-గుడివాడ-అవనిగడ్డ నుంచి వచ్చే యాత్రికులకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ నుండి వచ్చే యాత్రికులకు తాడేపల్లి వద్ద ప్రైవేట్ ల్యాండ్‌లో తాత్కాలిక బస్టేషన్‌లతో పాటు అదనంగా వీలైనచోట్ల అవసరమైతే ప్రైవేట్ స్థలాల్లోనైనా తాత్కాలిక బస్సు స్టేషన్లు ఏర్పాటుచేయాలని ఎపిఎస్‌ఆర్‌టిసి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలన్నారు. పుష్కరాలపై తదుపరి సమీక్షా సమావేశం జరుగనున్న ఏప్రిల్ నాటికి పనుల ప్రగతి చూపాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ యాత్రికుల రద్దీని అంచనా వేస్తూ రద్దీని క్రమబద్దీకరించేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ఘాట్లకు యాత్రికులు సులువుగా చేరుకునే విధంగా అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ సదుపాయాలను, ఘాట్లలో చేపట్టిన, చేపట్టవలసిన పనులను సంబంధిత పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలన్నారు. రెవెన్యూ అధికారులతో పోలీస్ అధికారుల సమన్వయం చేసుకుని అదనపు పనులను, ఏర్పాట్లను గుర్తించాలన్నారు. దుర్గాఘాట్, పవిత్ర సంగమం ఘాట్లకై రూపొందించిన డిజన్లను చైనాకు చెందిన (గిజ్ హౌ), జిఐఐసి మారిటైమ్ సిల్క్ రోడ్డు ఇంటర్నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమావేశంలో అధికారులకు వివరించారు.
సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, సబ్ కలెక్టర్ డా. జి.సృజన, జిల్లా ఎస్‌పి జి.విజయకుమార్, డిఆర్‌ఓ సిహెచ్ రంగయ్య, డిసిపిలు కాళిదాస్ వెంకట రంగారావు, అశోక్‌కుమార్, ట్రాఫిక్ ఎసిపి నరసింహరావు, ఇరిగేషన్ ఎస్‌ఇ సి.రామకృష్ణ, డిఆర్‌ఎం అశోక్‌కుమార్, పంచాయితీరాజ్ ఎస్‌ఇ పి.సూర్యనారాయణ, ఆర్ అండ్ బి ఎస్‌ఇ కె.శేషుకుమార్, ఆర్‌ఢబ్ల్యుఎస్ ఎస్‌ఇ వి.గోపాలరావు, డిఎంహెచ్‌ఓ ఆర్.నాగమల్లేశ్వరి, డిపిఓ వి.కృష్ణకుమారి, గుడివాడ ఆర్‌డిఓ ఎం.చక్రపాణి, కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఇఓ చంద్రశేఖర అజాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ అంజనావతి మృతి
కూచిపూడి, మార్చి 26: నాట్యక్షేత్రం కూచిపూడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ చీకటిమర్ల అంజనావతి(65) శనివారం ఉదయం మృతి చెందారు. సర్పంచ్‌గా 1995 నుండి 2006 వరకు ఈమె పనిచేశారు. అంజనావతి భర్త చీకటిమర్ల శివరామప్రసాద్ మొవ్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. అంజనావతి తెల్లవారుఝామున అస్వస్థతకు గురికాగా విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అంజనావతి పార్దీవ దేహాన్ని ఆమె భర్త శివరామప్రసాద్ తమ స్వగ్రామమైన పెడసనగల్లు తీసుకొచ్చారు. అంజనావతి మృతదేహాన్ని పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన, మాజీ ఎమ్మెల్యే డివై దాస్, జెడ్పీటిసి చిమటా విజయశాంతి, మాజీ సర్పంచ్‌లు వైకెడి ప్రసాదరావు, మద్దాల నాగ భూషణరావు, సర్పంచ్ కందుల జయరాం, వైకాపా మండల అధ్యక్షులు రాజులపాటి రాఘవరావు, రాజులపాటి మురళి, తాతా రాంబాబు, ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఏచూరి ఉమాశంకర్, వెంకటరత్నం, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు హైదర్ అబ్బాస్ అలీ, పిట్టు శ్రీనివాసరావు, బోలెం సాంబశివరావు సందర్శించి నివాళులర్పించారు. స్థానిక శాంతి కాంప్లెక్స్‌లోని దుకాణాలు మూసివేసి సంతాపం తెలిపారు. శ్రీ సత్యసాయి సినీ థియేటర్‌ను మూసివేశారు.