కృష్ణ

ఘనంగా రన్ ఫర్ జీసస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మార్చి 26: పునరుత్థానుడైన క్రీస్తుకు జయ హో అంటూ స్వాగతం పలుకుతూ నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాలు, రన్ ఫర్ జీసస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం వేలాది మంది క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బిషప్ అజరయ్య హైస్కూల్ గ్రౌండ్‌లో ఉదయం 6 గంటలకు నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఐక్యవేదిక కో ఆర్డినేటర్స్ బి.శివాజీరాజు, రెవ.ఎస్.జయకుమార్ తదితరులు బెలూన్స్ ఏగురవేసి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ రెడ్ సర్కిల్, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, ఘంటసాల సంగీత కళాశాల, శారద కళాశాల, ఊర్వశీ సెంటర్ మీదుగా సాంబమూర్తి రోడ్డు లూథరన్ చర్చి గ్రౌండ్‌కు చేరుకొని ముగింది. ఈ సందర్భంగా నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ మానవులపై కరుణ, ప్రేమ కురిపించిన ఏసుక్రీస్తు పాపులకోసం చివరికి శిలువపై ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఏసుక్రీస్తు చూపిన మార్గం అందరకి ఆదర్శప్రాయం కావాలన్నారు. నగరంలో ఇటువంటి రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించడం వలన మత సామరస్యానికి అద్దం పడుతాయన్నారు. కో ఆర్డినేటర్ బి.శివాజీరాజు మాట్లాడుతూ మృత్యుంజేయుడైన ఏసుక్రీస్తుకు స్వాగతం పలుకుతూ సంబరాల మధ్య విజయవాడతోపాటు, మూడు రాష్ట్రాలలోని 600 పట్టణాలలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. విమ్స్ నర్సింగ్ కళాశాల ఛైర్మన్ టి.అర్జునరావు మాట్లాడుతూ పునరుత్థానుడైన ఏసుక్రీస్తును స్తుతిస్తూ కుల, మతాలకు ఆతీతంగా వేలాది మంది రన్ ఫర్ జీసస్‌లో పాల్గొనటం ఆహార్షణీయమన్నారు. జిడిఎంఎం కాలేజీ ఛైర్మన్ ప్రసాదరావు మాట్లాడుతూ కరుణ, క్షమాగుణం క్రీస్తు స్వతం అన్నారు. మేజర్ విలయమ్స్, రెవ.జాన్‌దేవదాస్, రెవ.పి.ఫ్రభాకరరావురెవ.డాక్టర్ విజయ జయ హో అంటూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమాన్ని రెవ.కొడాలి ఏలియా, రెవ.దయానందం, రన్ ఫర్ జీసస్ కో ఆర్డినేటర్స్ మంగళపూడి జోసఫ్, శీలం ప్రవీణ్, బ్రదర్ జి.సింగ్, బ్రదర్ అభిలాస్ తదితరులు పర్యవేక్షించారు.

తీరంలో దాహం కేకలు!
కృత్తివెన్ను, మార్చి 26: మండల పరిధిలో మంచినీటి చెరువులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. తీరంలోని ప్రజలు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మూగజీవాల పరిస్థితి వర్ణనాతీతం. దేవుడి కరుణో, పాలకులు శ్రద్ధ వహించో వెంటనే మంచినీరు అందించకపోతే మరిన్ని కష్టాలు తప్పవంటూ ప్రజలు వాపోతున్నారు. రెండు పంటలు లేక ఎలా జీవించాలన్న రైతన్నలకు బాసటగా నిలిచిన పాడి పరిశ్రమకు కూడా తాగునీటి సమస్య ఎదురైంది. కృత్తివెన్ను మండలం సముద్ర తీరానికి ఆనుకుని ఉంది. కాలువల ద్వారా మంచినీరు వచ్చే అవకాశం లేకపోవటంతో బావుల ద్వారా మంచినీటిని వాడుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. మండలంలో ఎక్కడ భూమిని తవ్వినా ఉప్పునీరే శరణ్యం అవుతోంది. మండల పరిధిలోని 16 పంచాయతీల్లో తాగునీటిని అందించే రక్షిత మంచినీటి చెరువులు, పశువుల చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ప్రజల దాహార్తిని తీర్చేలా సీతనపల్లిలో నిర్మితమైన 50 ఎకరాల మెగా రక్షిత మంచినీటి చెరువు కూడా పూర్తిగా అడుగంటింది. శివారు ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరు ఈ చెరువు. రెండు పంటలు లేక, వర్షాలు పడక ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వేలకు వేలు పెట్టి మినరల్ వాటర్‌ను కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. మంచినీటి కోసం రెండుసార్లు ప్రధాన పంట కాలువకు నీరు వదిలినా నాయకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల చెరువులను పూర్తిగా నింపలేకపోతున్నారు. మార్చిలోనే మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పాలకులు, అధికారులు స్పందించి ప్రజలకు, మూగజీవాలకు తాగునీరు అందించాలని మండల వాసులు వేడుకుంటున్నారు.

తిరుపతమ్మకు వైభవంగా ..
పుట్టింటి పసుపుకుంకుమ
* భక్తిశ్రద్ధలతో
సమర్పించిన భక్తులు
పెనుగంచిప్రోలు, మార్చి 26: తిరుపతమ్మ నామస్మరణతో పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు గ్రామాలు శనివారం మార్మోగాయి. శ్రీఅమ్మవారి చి న్న తిరునాళ్ల ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే పుట్టింటి పసుపుకుంకుమ సమర్పణ శనివారం ఘ నంగా జరిగింది. ఈసందర్భంగా అమ్మవారి పుట్టిల్లు అయిన అనిగండ్లపాడు గ్రామంలో అమ్మవారి వంశానికి చెందిన కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన పసుపుకుంకుమ సారెకు భక్తజన సేవా కమిటీ సభ్యుడు కర్ల వెంకట నారాయణ, ఎఇఒ మేడా గోపాలరావు, వేద పండితుల సాక్షిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యుత్ దీపాలతో పూలదండలతో అందంగా అలంకరించిన బం డ్లపై ఉంచి ఊరేగింపుగా పెనుగంచిప్రోలు గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పసుపు కుంకుమ బం డ్లకు అడుగడుగునా మహిళలు వారులుపోస్తూ కొబ్బరికాయలు కొడుతూ మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం పసుపు కుంకుమ బండ్ల వెంబటి గ్రామానికి చెందిన మరో వంద బండ్ల వరకూ పెనుగంచిప్రోలు గ్రామానికి బయలుదేరాయి. పెనుగంచిప్రోలు గ్రామానికి చేరుకున్న ప్రభ బండ్లకు మునే్నటి కాజ్‌వే సాయి బాబా ఆలయం వద్ద గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వీటితో పాటు గ్రామానికి చెందిన చంద్రమ్మ అమ్మవారికి కూడా పుట్టింటి వారైన కనే్నటి వంశస్తులు పసుపు కుంకుమ తీసుకువచ్చి సమర్పించారు. పోలీస్ స్టేషన్ సెంటర్ మీదుగా ఆలయానికి చేరుకున్న పసుపు కుంకుమ బండ్లకు కార్యనిర్వహణ అధికారి ఎం రఘునాధ్, భక్తజన సేవా సమితి సభ్యుడు కర్ల వెంకట నారాయణ, తహశీల్దార్ కె నాగేశ్వరరావు, సిఐ లచ్చునాయుడు ఆధ్వర్యంలో స్వాగతం పలకగా కొల్లా శ్రీనివాసరావు దంపతులు అమ్మవారికి పసుపుకుంకుమ సారెను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు దంపతులను అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ పసుపు కుంకుమ బండ్లను తిలకించేందుకు పొరుగు రాష్ట్రానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పసుపు కుంకుమ సమర్పణ అనంతరం వాటిని స్వీకరించేందుకు భక్తులు ఎగబడటంతో కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పసుపు కుంకుమ బండ్లకు జగ్గయ్యపేట సిఐ లచ్చునాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే తిరునాళ్ల ముగింపు దశకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండే క్యూలైన్‌లలో బారులు తీరారు. ఎస్‌ఐ కె సతీష్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తెలంగాణా రాష్ట్రం ముదిగొండకు చెందిన పలువురు హిజ్రాలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.