కృష్ణ

రవీంద్రుని గీతాంజలి ప్రార్థనల సమాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 26: మహాకవి, నాటకకర్త, నవలా రచయిత, కథా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి కావ్యం ప్రార్థనా గీతాల సమాహారమని ప్రముఖ సాహితీవేత్త డా. మాదిరాజు రామలింగేశ్వరరావు అన్నారు. స్థానిక బచ్చుపేట మహతి గ్రంథాలయంలో నిర్వహిస్తున్న నెలనెలా వెనె్నల కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ‘రవీంద్రనాథ్ ఠాగూర్ - గీతాంజలి’ అనేం అంశంపై ప్రసంగించారు. బెంగాలీ భాషలో రచించిన గీతాంజలిని తానే ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించారన్నారు. ఒకసారి బిడ్డగా మరొకసారి ప్రియురాలిగా, ఇంకోసారి భక్తునిగా రవీంద్రుడు అంజలి ఘటించారన్నారు. మానవుడు మాయలోపడి ఆత్మకు, పరమాత్మకు ఉన్న బంధాన్ని గుర్తించలేక పరమాత్మకు దూరమవుతున్నాడని హృద్యంగా చిత్రీకరించారన్నారు. మృత్యువును విముక్తి ద్వారంగా, మృత్యు దేవతను భగవంతుని దూతగా ఆయన అభివర్ణించాడన్నారు. ప్రతి గీతం మనసులోనికి చొచ్చుకుపోయి చదువరులను వేరే ప్రపంచంలోకి తీసుకెళుతుందన్నారు. కొన్ని గీతాలు సంగీతమయంగా ఉండటం కావ్య విశేషమన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మచిలీపట్నం సబ్ బ్రాంచ్ కార్యదర్శి గొరిపర్తి పాపరాజు మాట్లాడుతూ రవీంద్రుడు భారతీయ తత్వానికి ప్రతీక అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎల్‌ఎస్ శాస్ర్తీ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించడానికి శాంతి నికేతన్, విశ్వభారతి విద్యాలయాలను ఆయన స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి నాగలింగశాస్ర్తీ, భవిష్య, కాపవరపు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.