కృష్ణ

మానసిక ఉల్లాసానికి సినిమానే సాధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, ఏప్రిల్ 9: మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికే సినిమాలే సాధనంగా నిలుస్తాయని హాస్య నటుడు వేణు అన్నారు. స్థానిక అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఉగాది పురస్కారాలు, సాంస్కృతిక సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలుగు వారికి తొలి పండుగగా ఉగాదిని జరుపుకోవడం అనవాయితీగా వస్తున్నదేనని, దీనిలో తాను పాల్గొనడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను కలుసుకునే అవకాశం ఏర్పడినందుకు ఆనందంగా ఉందన్నారు. నేటి తరం నటులు అందరితో తాను నటించానని, తాను పోషించిన పాత్రలను ప్రేక్షకులు ఆదరించడం తన అదృష్టమన్నారు. సంస్థ అధ్యక్షులు తలశిల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆధునికత తెలుగు వారి సంస్కృతిని, సాంప్రదాయాలను దూరం చేస్తున్న పరిస్థితుల్లో సాహిత్య, సాంస్కృతిక, కళా సేవా సంస్థ పేరుతో 1921వ సంవత్సరంలో అభ్యుదయ వేదిక అవిర్భవించిందని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రాధాన్యతా రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి ఉగాది రోజున పురస్కారాలు ఇవ్వటంతో పాటు దాతల సహకారంతో నిరుపేదలకు వస్తద్రానం కూడా చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి వర్రె రాంబాబు, వైసిపి నేత గుడివాక శివరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు లోగిలి వ్యవస్థాపకులు పేర్ల శ్రీనివాసరావు, కవి, రచయిత కొట్టె రామారావు, కృష్ణ జ్యోతి సంపాదకులు మత్తి శ్రీకాంత్, డ్రైనేజీ డిఇ మారుతీ ప్రసాద్, నర్తకులు పావని, హరిణిలను ఘనంగా సత్కరించారు.

ఘనంగా సాంస్కృతిక పాఠశాల వార్షికోత్సవం
కూచిపూడి, ఏప్రిల్ 9: మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలోని లక్ష్మీపతి విద్యా విహార్ సాంస్కృతికోన్నత పాఠశాల 59వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్, ముముక్షుజన మహాపీఠాధిపతులు ముత్తేవి సీతారాం గురుదేవులు అనుగ్రహభాషణ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోనేపూడి దయాకర్ వార్షిక నివేదిక అందజేశారు.