కృష్ణ

మరపురాని ఘట్టంగా పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 1: జిల్లా చరిత్రలోనే మరపురాని ఘట్టంగా కృష్ణా పుష్కరాలు మిగిలిపోనున్నాయని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మండల పరిధిలోని పెద యాదర, సత్యనారాయణపురం గ్రామాల్లో రూ.5.40 కోట్ల అంచనాలతో చేపట్టిన పుష్కర నిర్మాణ పనులను పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని బందరు మండలంలో రూ.15కోట్లతో మూడు పుష్కర ఘాట్లు, పలు రహదారులు, రెండు ఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రూ.10.50 కోట్లతో శారదానగర్ - చిన్నాపురం వరకు డబుల్ లైన్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రూ.27 కోట్ల అంచనాలతో గుండేరు డ్రైన్‌పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. రూ.64 కోట్లతో భవానీపురం- ఉల్లిపాలెం వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. పులిగడ్డ నుండి దిగువకు కృష్ణా కరకట్ట రహదారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జల సంరక్షణకు ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. ఇందులో భాగంగా పంట సంజీవని కింద రైతులు తమ పొలాల్లో నీటి కుంటలు తవ్వించుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటల తవ్వకాన్ని ప్రభుత్వం ఉచితంగా చేపట్టిందన్నారు. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రవీంద్ర కోరారు. పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రహదారులు, ఘాట్లు, దేవాలయాల అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, ఆర్డీవో సాయిబాబు, ఎంపిడివో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ నారదముని, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిడిపి నాయకులు గొర్రిపాటి గోపిచంద్, బూరగడ్డ రమేష్‌నాయుడు, కుంచే దుర్గాప్రసాద్, పంచాయతీరాజ్ ఇఇ అశోక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.