కృష్ణ

పర్యాటకులను ఆకట్టుకునేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మే 1: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్భాగంగా కూచిపూడిని చేర్చి ఈ గ్రామం పేరును, నాట్యం ఖ్యాతిని ఇనుమడింప చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా అమరావతిని సందర్శించే దేశ, విదేశీ పర్యాటకులు ప్రపంచ ప్రఖ్యాత నాట్యక్షేత్రం కూచిపూడిని సందర్శించేలా ఈ గ్రామాన్ని అవుటర్ రింగ్ రోడ్డులో అంతర్భాగంగా చేర్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే అమరావతి రింగ్ రోడ్డులో అంతర్భాగంగా కూచిపూడితో పాటు మహాకవి క్షేత్రయ్య నడయాడిన మొవ్వ, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రును కూడా చేర్చినట్లు రూట్‌మ్యాప్ ద్వారా తెలుస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి 188 కిలోమీటర్ల మేర ఎనిమిది లైన్ల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ రూ.19వేల 700కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. కాగా నాట్యక్షేత్రం కూచిపూడి నుండి భట్లపెనుమర్రు, ఐనంపూడి వయా పెడసనగల్లు పిఆర్ రహదారిని ఆర్ అండ్ బి శాఖ స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాదాపు ఆరు దశాబ్దాలుగా జిల్లా పరిషత్ పరిధిలోని పంచాయతీరాజ్ రహదారిగా ఉన్న ఈ రోడ్డును ప్రభుత్వం ఆగమేఘాలపై ఆర్ అండ్ బికి బదలాయిస్తూ జీవో జారీ చేయటం ఈప్రాంత ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల మొవ్వ పిఆర్ ఎఇ చంద్రశేఖరరావు, ఆర్ అండ్ బి ఎఇ ఐ శ్రీనివాసరావు ఈ రహదారిని పరిశీలించటం ఈప్రాంత ప్రజల్లో, ముఖ్యంగా రహదారికి ఇరువైపులా ఉన్న పేద, బడుగు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆర్ అండ్ బి పరిధిలోకి వచ్చిన ఈ రహదారి గతంలో 12 అడుగుల వెడల్పు ఉండగా 23 అడుగుల వెడల్పుతో విశాలంగా నిర్మించటంతో పాటు బీమనది ఛానల్‌పై వంతెన, పెడసనగల్లులో కల్వర్లు, గ్రామ శివారులో పైపులైన్ కల్వర్టును విశాలంగా మార్చేందుకు ప్రభుత్వం దాదాపు రూ.19కోట్లు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు తెలుగుతమ్ముళ్లు మంత్రి శిద్దా రాఘవరావును కలిసి ఆయన అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనా కూచిపూడి నాట్యకళపై ప్రత్యేక శ్రద్ధ కనపరస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యాటకుల రాక కోసం ఇప్పటికే నాట్యారామంగా అభివృద్ధిపరుస్తూ అమరావతిలో అంతర్భాగంగా చేస్తుండటం ఈప్రాంతానికి మహర్దశగా పలువురు పేర్కొంటున్నారు.