కృష్ణ

మీ భవిష్యత్ కోసం శ్రమిస్తున్న కార్మికుడిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, మే 1: భవిష్యత్తు తరాల కోసం ఇప్పటి నుంచే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనికి తీసుకురావడంతో పాటు పెట్టుబడులు వాటి ద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు శ్రమిస్తున్న మొదడి కార్మికుడిని నేనేనని నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇదే సమయంలో కార్మికులకు అన్యాయం జరగకుండా యాజమాన్యాలను ఒప్పిస్తూ వారికి కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలను అందిస్తూ వారి పక్షానే నిలుస్తున్న ప్రభుత్వానికి సహకరించేందుకు కార్మికులు ముందుకు రావాలన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులు అదనంగా మరో నాలుగు గంటలు శ్రమించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మేడేను ఆదివారం నగరంలోని ఎ కనె్వన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అధారిత మన రాష్ట్రంలో ఉన్న కార్మికులు, కర్షకులు ప్రభుత్వానికి రెండు కళ్ల వంటి వారని వారిని అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్నట్లు చెప్పారు. చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి బాబు దానికి సంబంధించిన సిడిని అవిష్కరించారు. రాష్ట్ర కార్మిక సంక్షేమశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కార్మికశాఖని కార్మిక సంక్షేమ శాఖగా మార్చినట్లు చెప్పారు. పారిశ్రామికంగా మనం అభివృద్ధి చెందిన నాడే రాష్ట్ర పురోభివృద్ధి మరింత సాధ్యపడుతుందన్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ దేశాపురోభివృద్ధికి కార్మికుడే కొలమానంగా అభిప్రాయపడ్డారు. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి జి అనంత రామ్ మాట్లాడుతూ గతంలో కార్మికశాఖ చట్టాలను ఉల్లఘించిన సమయంలో పని చేసేదని కాని ఇప్పటి పరిస్థితుల్లో కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా నగరంలోని సింగ్‌నగర్‌కు చెందిన డ్రైవర్ సేపేని శ్రీనివస్ చిన అవుటపల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో మరిణించిన కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్మును అందిన విధానం ఆయన కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నగరానికి చెందిన ఘంటశాల డాన్స్ అకాడమీ విద్యార్థులు పలు సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలు అహుతులను ఎంతగానో అలరించాయి. కూచిపూడి, కథక్, ఒడిస్సీతో పాటు కేరళా నృత్యాలు అద్యంతం ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి, పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, బొండా ఉమ, జలీల్‌ఖాన్, శాప్ ఛైర్మన్ పిఆర్ మోహన్, కమిషనర్ డి వరప్రసాద్, కలెక్టర్ బాబు ఎ, సబ్ కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.

30 మందికి ఉత్తమ యాజమాన్య,
65 మందికి శ్రమశక్తి అవార్డులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 1: మేడే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన యాజమాన్య అవార్డులు, అలాగే 65 మంది కార్మికులకు శ్రమశక్తి అవార్డులను అందజేసారు. విశేషం ఏమిటంటే శ్రమశక్తి అవార్డు గ్రహీతల్లో అత్యధిక మంది తెలుగుదేశం అనుబంధ టిఎన్‌టియుసికి చెందినవారు ఉండగా వామపక్ష కార్మిక సంఘాలకు చెందిన ఏ ఒక్కరికీ అవార్డు లభించలేదు. ఉత్తమ యాజమాన్య అవార్డులు అందుకున్న ప్రముఖుల్లో జువారీ సిమెంట్ జిఎం సి.వెంకటేశ్వరరావు (కడప), డక్కన్ జ్యూవెలర్స్ ప్రతినిధి ఇర్‌ఫాన్ ఖాన్ (విశాఖ), వరుణ్ మోటార్స్ ప్రతినిధి వి.ప్రభుకిషోర్ (విశాఖ), ఐటిసి ఎబిడి లిమిటెడ్ చైర్మన్ వైసి దేవేశ్వర్ (అనపర్తి), సర్వారాయ షుగర్స్ ఎండి ఎస్‌బి రాజారాజేశ్వరమ్మ (కడియం), సెంటినీ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ కె.జయ (కంచికచర్ల), హోటల్ గేట్‌వే ఎండి మలినేని రాజయ్య (విజయవాడ), డా. ఎన్‌టిటిపిఎస్ తరపున జెన్‌కో ప్రిన్సిపల్ సెక్రటరీ కె.విజయ్ ఆనంద్, ఆప్మెల్ ఎండి ఎ.గోవిందరావు (కొండపల్లి), రామ్‌కో సిమెంట్ చైర్మన్ పిఎన్ రామసుబ్రమణ్య రిజ్వా (జగ్గయ్యపేట), అనంతలక్ష్మి షిప్పింగ్ మిల్స్ ఎండి కోటేశ్వరరావు (బోయపాలెం, గుంటూరు జిల్లా) ఉన్నారు.
శ్రమశక్తి అవార్డులు అందుకున్నవారిలో ఉయ్యూరులోని కెసిపి షుగర్స్ వర్కర్స్ యూనియన్ అధినేతలు ఎ.బాలసుబ్రహ్మణ్యం, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి చుండూరు వెంకటేశ్వర్లు (ప్రకాశం), గుంటూరు నగర అధ్యక్షులు సామికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుసుమ సూర్యమోహనరావు (అమలాపురం), చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.గౌరి, తిరుపతి నగర అధ్యక్షులు పి.రెడ్డప్పనాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు పాతగుంట గిరి (తిరుపతి), తిరుపతి నగర కార్యదర్శి ఎండి కల్యాణ్, ఇలా మరో 20 మంది టిఎన్‌టియుసి నేతలు ఉన్నారు. విజయవాడకు చెందిన ఎలక్ట్రీషియన్ మండవ కుటుంబరావు, ప్రముఖ క్రీడాకారుడు, రైల్వే ఉద్యోగి ఆకుల రాఘవేంద్ర తదితరులున్నారు.

ఆవిరవుతున్న దుర్గగుడి భూములు?
* 16 ఎకరాల భూమి విలువ రూ.50 కోట్లు?
విజయవాడ (ఇంద్రకీలాద్రి) మే 1: కృష్ణా, గుంటూరు జిల్లా బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.50కోట్లు విలువ చేసే దుర్గగుడికి చెందిన 16 ఎకరాల భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. వీటికి చెందిన ఫైల్స్‌ను కదిపినట్లు తెలిసింది. గుంటూరుజిల్లా కొలనుకొండలో ఉన్న 8 ఎకరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దుర్గగుడి అధికారుల నుండి తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, మిగత పేపర్స్ కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దేవస్థానం అధికారుల నుండి తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా చెల్లించలేదు. నెలలు గడుస్తున్నప్పటికీ దేవస్థానం అధికారులు కూడా నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటి వరకు ఒక లేఖ సైతం రాష్ట్ర ప్రభుత్వానికి రాయకపోవటం గమినిస్తే దుర్గగుడి అధికారులు ప్రభుత్వం పట్ల ఎంత విధేతతో ఉన్నారో స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ, రామవరప్పాడులో ఇదే దేవస్థానానికి చెందిన మరో 8ఎకరాల భూమిని ఇవ్వాలని కేంద్రం నుండి దేవస్థానానికి లేఖ వచ్చినట్లు సమాచారం. ఐతే రామవరప్పాడులోని 8ఎకరాల భూమిని ఇస్తే ఈ భూమిలో కొన్ని ఔపధ మొక్కలు, ప్రత్యేకమైన పూల మొక్కలు పెంచేందుకు వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖల అధీనంలో వేల ఎకరాల భూములు ఉండగా ప్రత్యేకంగా దుర్గగుడి చెందిన భూములనే తీసుకోవటం ఎంతవరకు సమంజమని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు తీసి దుర్గగుడి అభివృద్ధి చేసేందుకు ఒక పక్క ఇన్‌చార్జ్ ఇవో అజాద్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా మరో వైపు దుర్గగుడికి చెందిన విలువైన భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవటం గమినిస్తే భవిష్యత్‌లో దుర్గగుడి ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉంది. భవిష్యత్‌లో దుర్గగుడి సిబ్బంది జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు దాపురించే ప్రమాదం పొంచి ఉందని పలువురు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోరాటాలతోనే కార్మిక హక్కుల సాధన సాధ్యం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 1: ప్రభుత్వాలు ఎన్ని మారినా కార్మికులకు అన్యాయమే జరుగుతోందనీ, పోరాటాల ద్వారానే కార్మిక హక్కుల సాధన సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఉద్ఘాటించారు. ప్రపంచ కార్మిక విప్లవ దినోత్సవం మేడే సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయం వద్ద అరుణపతాకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా 130వ మేడే వేడుకలు జరుగుతున్నాయన్నారు. 8గంటల పని దినాల కోసం చికాగో నగరంలో ఉవ్వెత్తున సాగిన ఉద్యమ ఫలితంగా ప్రపంచ కార్మిక సోదరులంతా మేడే జరుపుకుంటున్నారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో పాలకపక్షాలు ఎన్ని మారినా కార్మికుల జీవన స్థితిగుతులు మారడం లేదన్నారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడక తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి దుర్గ్భావాని, కృష్ణాజిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, ప్రొగ్రెసివ్ ఫోరం నాయకులు డాక్టర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.