కృష్ణ

డిజిటల్ డోర్ నెంబర్‌తో విస్తృత ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 2: నగరంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్ డోర్ నెంబర్ ద్వారా విస్తృత ప్రయోజనాలుంటాయని విఎంసి అదనపు కమిషనర్ (జనరల్) పి అరణ్‌బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నగరంలోని 42వ డివిజన్ బవాజీపేటలో జరుగుతున్న డిజిటల్ డోర్ నెంబర్ల కేటాయింపు ప్రక్రియను పరిశీలించిన అరుణ్‌బాబు మాట్లాడుతూ శాటిలైట్ తో అనుసంధానమైయ్యే డిజిటల్ స్మార్ట్ డోర్ నెంబర్‌తో చిరునామా సులభంగా కనుగొనవచ్చునన్నారు. స్మార్ట్ ఫోన్ సహాయంతో ఇంటి చిరునామాను కనుగొనే విధంగా చేపట్టిన ఈప్రక్రియకు ప్రతి వీధికీ స్ట్రీట్ కోడ్‌ను కేటాయిస్తామన్నారు. అంబులెన్స్, పోలీస్, ఫైర్ తదితర అత్యవసర సేవలకు సులభతరమన్నారు.
నగరంతో పరిచయం లేని వారు కూడా జిపిఎస్ సిస్టమ్ సహాయంతో ఇంటిని సులువుగా కనుగొనవచ్చునని తెలిపారు. రాజధాని నగరంగా విరాజిల్లుతున్న విజయవాడ నగర పరిసరాలు, ఇంటి అడ్రస్‌లు అంతర్జాలంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందు కు జిప్పర్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఆయా సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చి అన్ని వివరాలను సేకరిస్తారని, ఇందుకు ఇంటి యజమానులు పూర్తి సహకారాలివ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎసిజి డోర్ నెంబర్ కేటాయింపును స్వయంగా పరిశీలించిన ఆయన పలు సూచనలుచేస్తూ ఈ విధానంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు.

మరింత వేగంగా పనులు చేపట్టాలి

విజయవాడ, మే 2: జిల్లాలో నీరు - చెట్టు కార్యక్రమం ద్వారా చేపడుతున్న పంట సంజీవని, ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్స్, చెరువుల్లో పూడికతీత వంటి పనులు ప్రగతిని నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షించారు. పనులకు నిధుల కొరత లేదని జిల్లాలో పనులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు నగరంలోని ఎ కనె్వషన్ హాలులో వర్క్‌షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం మండలం చిక్కవరంలో బ్రహ్మయ్యలింగం చెరువు వద్ద నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. సాయంత్రం 4 గంటలకు ఎ కనె్వషన్ హాలులో నిర్వహించే నీరు - చెట్టు వ ర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. జలవనరుల శా ఖ అధికారులు ముఖ్యమంత్రి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో జలవనరులశాఖ సిఇవైఎస్ సుధాకర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ సి రామకృష్ణ, గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ వరప్రసాదరావు, చైనా టీం సభ్యులు, సోమా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో హోంగార్డు ఆత్మహత్యాయత్నం
* కాల్‌మనీ వ్యాపారుల వేధింపులపై జేసీకి వినతి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మే 2: కాల్ మనీ వ్యాపారుల వేధింపుల తాళలేక హోంగార్డు సోమవారం కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక వలందపాలెంకు చెందిన కొట్టి సీతారామాంజనేయులు మచిలీపట్నం పోలీసు కంట్రోల్ రూమ్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. సీతారామాంజనేయులు తండ్రి సింహాచలం ఇంటి అవసరాల నిమిత్తం గుడిశే మురళీకృష్ణ, యండి మహబూబ్, యండి మస్తాన్‌లకు ప్రామిసరీ నోట్లు ఇచ్చి రూ.60వేలు అప్పుగా తీసుకున్నాడు. రూ.60వేలుతోపాటు రూ.30వేలు వడ్డీగా చెల్లించి ప్రామిసరీ నోట్లు తీసుకోలేదు. అప్పు చెల్లించిన కొన్ని వారాలకు సింహాచలం మృతి చెందాడు. దీన్ని అసరాగా తీసుకున్న సంబంధిత వడ్డీ వ్యాపారులు మీ తండ్రి మా దగ్గర అప్పు తీసుకున్నాడని లక్ష రూపాయలు చెల్లించాలంటూ గత కొన్ని రోజులుగా వత్తిడి చేస్తున్నారు. దీనిపై ఇటీవల కోర్టులో దావా కూడా వేశారు. దీనిపై మనస్థాపం చెందిన సీతారామాంజనేయులు సోమవారం కలెక్టరేట్ బయట పురుగుమందు తాగి వడ్డీ వ్యాపారుల ఆగడాలపై జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడుకు వినతిపత్రం ఇచ్చి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. మీకోసంలో ఉన్న వైద్యాధికారులు హుటాహుటిన సీతారామాంజనేయులును జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. దీనిపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.