కృష్ణ

కరకట్టపై వేడి సెగలు * అల్లాడుతున్న ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మే 25: రోజురోజుకి ఎండ తీవ్రత అధికమవటంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావటానికి భయపడుతున్నారు. కృష్ణానది కరకట్టపై మంగళవారం విపరీతమైన ఉష్ణోగ్రత పెరిగింది. ఒకపక్క ఇసుక పాయ ఉండటంతో ఉదయం 10 గంటల నుంచే కరకట్టపై ప్రయాణం కష్టంగా మారిందని ప్రజలు చెపుతున్నారు. ఇసుక పాయ వైపు నుంచి వేడిగాలులు, రోడ్డు నుంచి వేడి పుట్టుకు వస్తుండటంతో అల్లాడిపోతున్నామని అంటున్నారు. హైవే రోడ్డుని తలపించేలా ప్రతిరోజూ తీరగ్రామాల నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనాలు, కార్ల రాకపోకలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్న సమయంలో కరకట్టపై వాహనాల జాడ లేదంటేనే ఎండకు ఎంత భయపడిపోతున్నారో అర్థమవుతుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయట తిరగకపోవటమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. అత్యవసరమైన పని వుంటే తగిన జాగ్రత్తలతో ప్రయాణించాలని వైద్యులు చెపుతున్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు లాటరీలో విద్యార్థుల ఎంపిక
మచిలీపట్నం (కల్చరల్), మే 25: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకం కింద జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం 3, 5, 8 తరగతుల్లో ప్రవేశానికి లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. డిఆర్‌ఓ రంగయ్య అధ్యక్షతన జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి శివప్రసాద్ టాటరీ నిర్వహించారు. 3వ తరగతిలో 42 మంది బాలురు, 27 మంది బాలికలు, 5వ తరగతిలో 18 బాలురు, 12 మంది బాలికలు, 8వ తరగతిలో 19 మంది బాలురు, 10 మంది బాలికలు మొత్తం 128 మంది ఎంపికయ్యారు. 182 సీట్లకు గాను 128 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో డివైఇఓ, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.
ఇదిలావుంటే, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటి, జెఇఇ, ఎఐఇఇఇ, ఎంసెట్ శిక్షణ ఇవ్వడానికి కార్పొరేట్ కళాశాలలు రిజిస్టర్ చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె సునీల్‌రాజ్ కుమార్ కోరారు. పక్కా భవనాలు, పూర్తిస్థాయి లైబ్రరీ, ల్యాబ్, రెసిడెన్షియల్ సౌకర్యం, ప్రతిభావంతులైన అధ్యాపకులు, 90శాతం ఉత్తీర్ణత, 50శాతం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత, ఐఐటి, జెఇఇ, ఎఐఇఇ, ఎంసెట్‌లలో అత్యధిక ర్యాంకులు సాధించిన కళాశాలల్లో ఈ నెల 30లోపు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్న దరఖాస్తులు, ధ్రువపత్రాలతో ఈ నెల 30న సాయంత్రం 5గంటల్లోపు సంయుక్త సంచాలకుల కార్యాలయంలో సమర్పించాలని కోరారు. వివరాలకు 08672-252743 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.