కృష్ణ

అర్థరాత్రి పెనుగాలుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మే 28: తోట్లవల్లూరులో శనివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని కళ్ళంవారిపాలెం జడ్పీరోడ్డులో మూడు భారీ చెట్లు వేళ్ళతో సహా నేలకూలాయి. దీంతో రాకపొపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెట్ల తొలగింపుని చేపట్టారు. అలాగే కళ్ళంవారిపాలెం దళితవాడలో తూమాటి రమణకు చెందిన రేకుల షెడ్డు ధ్వంసం అయ్యింది. ఈమె పక్కా గృహం శ్లాబు దశలో ఆగిపోగా రేకుల షెడ్డులో ఉంటోంది. శనివారం వీచిన గాలికి సిమెంటు రేకులు ముక్కలు, ముక్కలుగా విరిగిపడ్డాయి. దీంతో నిలువనీడ లేకుండా పోయిందని రమణ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. చాగంటిపాడులో రెండు తాటిచెట్లు విరిగాయి. ఈ బీభత్సం వల్ల పలుచోట్ల కరెంటు స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు విరిగి పడ్డాయి. ప్రకృతి విలయతాండవంతో ప్రజలు అనేక అవస్థలు పడాల్సి వచ్చింది.

నిత్య సాహిత్య కృషీవలుడు ‘పుట్టపర్తి’

మచిలీపట్నం (కల్చరల్), మే 28: సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు తనదైన శైలిలో తెలుగు నేలను సస్యశ్యామలం చేసిన కృషీవలుడని దూరదర్శన్ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ డా. పుట్టపర్తి నాగపద్మిని అన్నారు. స్థానిక మహతి లిలత కళావేదికలో శనివారం జరిగిన సాహిత్య సభలో పుట్టపర్తి నారాయణాచార్యులు జీవితం-సాహిత్యం అనే అంశంపై ఆమె ప్రసంగించారు. చతుర్ధశ భాషాగహన వీధి విహారిగా తెలుగు సాహిత్యాభిమానులకు నారాయణాచార్యులు చిరపరిచితులన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పెనుబోతు వెంకటేశ్వరరావు, సవరం వెంకటేశ్వరరావు, యండి సిలార్ తదితరులు పాల్గొన్నారు.

తీరప్రాంతంలో వెంటాడుతున్న కరవు

అవనిగడ్డ, మే 28: దివిసీమలోని తీరప్రాంతంలో కరవు వెంటాడుతోంది. హంసలదీవి శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలోని కరవు కారణంగా గోవులకు పశుగ్రాసం కొరవడటంతో అవి అవనిగడ్డ మండలానికి శనివారం వలసవచ్చాయి. మండల పరిధిలోని మోదుమూడి గ్రామంలో పచ్చని బైళ్ళు కొన్ని ప్రాంతాలలో ఉండటంతో అక్కడ పశుగ్రాసం కోసం వాటిని తరలించారు. ఈ తరహాలో గతంలో ఎన్నడూ లేని విధంగా గోవులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆహారాన్ని తీసుకోవటం విశేషం. ప్రభుత్వం కనీసం గోమాతలకు అయినా పశుగ్రాసం సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం

మైలవరం, మే 28: నిద్రిస్తున్న వ్యక్తిపై నుండి లారీ వెళ్ళటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం ఎ కొండూరు తండాకు చెందిన భూక్యా వినోద్‌కుమార్ (16) జాతీయ రహదారి విస్తరణ పనులలో కార్మికునిగా ఏడు మాసాలుగా పని చేస్తున్నాడు. ఇతను పనిలో భాగంగా నైట్ డ్యూటీ చేసి రోడ్డు పక్కనే నిద్రిస్తున్నాడు. శనివారం వేకువఝామున 4.30 గంటల సమయంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో మట్టిని తరలించే దిలీప్ కంపెనీకి చెందిన కాంట్రాక్ట్ లారీ రివర్స్ చేస్తూ ప్రమాద వశాత్తూ అతని తలపైనుండి పోవటంతో తలంతా నుజ్జునుజ్జయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అగ్రిగోల్డ్ బాధితుల నిరసన

నాగాయలంక, మే 28: నాగాయలంకలో శనివారం అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పురవీధులలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ఏపి వైఎస్‌ఆర్ సీపి ట్రేడ్ యూనియన్ కార్యదర్శి గుడివాక శివరావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు తలసిల లీలా మనోహర్ నాయకత్వం వహించారు. స్థానిక వెంకట్రామా థియేటర్ నుంచి ప్రధాన వీధి గుండా తహశీల్దార్ కార్యాలయానికి చేరిన ఈ ప్రదర్శనలో అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఈ సంస్థ చెల్లించాల్సిన బకాయి తక్షణమే అందేవిధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను సైతం వేలం వేయడం ద్వారా తమకు పూర్తి న్యాయం చేకూర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు అగ్రిగోల్డ్ బాధితులు తహశీల్దార్ స్వర్గం నరసింహారావు, ఎస్‌ఐ గుడివాడ అనిల్‌కు వినతిపత్రాలు సమర్పించారు.