కృష్ణ

వాల్ పెయింటింగ్స్ పెరిగిన నగర అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 30: నగరంలో వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థలు వేస్తున్న వాల్‌పెయింటింగ్స్ పలువుర్ని ఆకట్టుకుంటున్నాయని దీంతో ప్రధాన కూడళ్లలో ఉన్న గోడలు అందంగా తయారయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం సాయంత్రం ఎ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన ట్రాన్స్‌ఫార్మింగ్ విజయవాడ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టర్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో ఉందని, అలాంటి యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరన్నారు. నగరంలో ఇప్పటివరకు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు రూ.8 లక్షలతో 8వేల మీటర్లు గోడ పొడవునా పెయింటింగ్స్ వేయటం జరిగిందని కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరో 20వేల మీటర్ల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పెయింటింగ్స్‌లో ఆర్కిటెక్చర్ కళాశాలల విద్యార్థులు పాల్గొని గోడలను అందంగా రూపుదిద్దడంలో వారి పాత్ర విశేషంగా ఉందని రాజధాని అమరావతి ఆర్కిటెక్చర్ ప్లాన్స్‌ను వారికి అందజేసి వారి సలహాలను తీసుకోవడం జరుగుతుందన్నారు. రానున్న పుష్కరాల్లో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని పుష్కరాలకు వచ్చిన వారిందరినీ మర్యాదగా పలకరించడంతో పాటు వారికి ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. భవిష్యత్‌లో ఎవ్వరూ మర్చిపోని విధంగా చరిత్రలో నిలిచేలా పుష్కరాలు జరపాలన్నారు. పుష్కరాల్లో కూచిపూడి నృత్యంతో పాటు దేశంలో ఉన్న అన్నిరకాల నృత్య కళాకారులను ఆహ్వానించటం జరుగుతుందన్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థులు నగరంలోని కాల్వల పక్కన ఉన్న కట్టడాలను తొలగించి వాటిని బ్యూటిఫికేషన్ చేస్తే ఎలా వుంటుందో ఆలోచన చేయాలన్నారు. కృష్ణా, గోదావరి నదులను కలిపిన ఘనత ప్రభుత్వానికే దక్కిందని, మున్ముందు పెన్నా, గోదావరి, కృష్ణా నదులను కలపనున్నట్టు పేర్కొన్నారు.