కృష్ణ

పుష్కర నగర్లు, పార్కింగ్ ప్రదేశాల పనులను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 1: మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న కృష్ణాపుష్కరాలకు గాను ఏర్పాటు చేస్తున్న పుష్కర నగర్లు, పుష్కర పార్కింగ్ ప్రదేశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేసి వినియోగానికి సిద్ధం చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ ఆదేశించారు. సోమవారం ఉదయం నగర ట్రాఫిక్ డిసిపి కాంతిలాల్‌తో కలిసి నగరంలోని పలు పుష్కరనగర్లు, పార్కింగ్ ప్రదేశాలను పర్యవేక్షించిన వారు ఆయా నిర్మాణ పనుల్లో నెలకొ న్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కృష్ణలంక దూరదర్శన్ స్థలంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలను చదునుచేసి వాహనాల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలంటూ ట్రాఫిక్ డిసిపి కాంతిలాల్ కోరిన మీదట స్పందించిన కమిషనర్ వీరపాండియన్ తక్షణమే ఆయా పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కృష్ణలంక ఫీడర్ రోడ్డుపై అనధికారికంగా పార్కింగ్ చేసిన లారీలను తక్షణమే తరలించాలన్నారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య విఎంసి స్టేడియంలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్‌ను పరిశీలించిన మీదట స్టేడియంలోకి రాకపోకలు సాగించేందుకు గాను ఒకే ఒక ప్రవేశ మార్గం ఉండటం వలన ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే రెండవ గేటును వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. సీతమ్మవారి పాదాలు, ఆర్‌టిసి వర్క్‌షాపు వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించిన వారు అక్కడ పనులు మరింత ఆలస్యంగా జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పుష్కరాల ప్రారంభంలోపుగానే ఆయా నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సితార జంక్షన్‌లో జరుగుతున్న ఆర్ అండ్ బి చేపడుతున్న అభివృద్ధిపనులు నిలచిపోవడమే కాకుండా విచ్చలవిడిగా డెబ్రీష్‌ను వేసి రాకపోకలకు అవరోధాలు సృష్టిస్తున్నందున తక్షణమే ఆయా పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో విఎంసి చీఫ్ ఇంజనీర్ ఎంఎ షుకూర్, ఎస్టేట్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌పిఎఫ్ ప్రత్యేక అధికారిగా సాంబశివరావు

విజయవాడ (రైల్వేస్టేషన్), ఆగస్టు 1: మరో పది రోజుల్లో ఆరంభం కానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే జోనల్ కార్యాలయం సికింద్రాబాద్ రైలు నిలయం నుంచి ప్రత్యేక భద్రతా విభాగపు అధికారిగా అసిస్టెంట్ సెక్యూరిటీ కోగంటి సాంబశివరావుని నియమించింది. రానున్న కృష్ణా పుష్కరాల్లో వచ్చే పుష్కర స్నానాదులు భక్తుల రద్దీ దృష్ట్యా తగిన భద్రత చర్యలపై ఎస్‌సి రైల్వే జోనల్ ఆర్‌పిఎఫ్ విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ జనరల్, చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ సంజై సంక్రిత్ యాయాన్ పుష్కరాల ప్రత్యేక అధికారిగా, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కె సాంబశివరావుని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఉత్తర్వులు అందుకున్న సాంబశివరావు డివిజనల్ సెక్యూరిటీ కార్యాలయంలో రిపోర్టు చేశారు. 2004లో వచ్చిన కృష్ణా పుష్కరాల్లో సైతం సాంబశివరావు విధులు నిర్వహించారు.

చేనేత పరిశ్రమని అన్ని విధాలుగా అదుకుంటా
బెంజిసర్కిల్, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆప్‌కాబ్‌ను పూర్తి స్థాయిలో విభజించలేదని, దీని కారణంగా నిధుల అంశంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖలతో పాటు, తెలంగాణ రాష్ట్రం నుండి నిధులు రావాల్సి ఉందని, త్వరలోనే వీవర్స్ సొసైటీలకు చెల్లించాల్సిన నిధులకు చెల్లింపులు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆప్‌కాబ్‌కు సంబంధించి ప్రతీ ఎడాది మెరుగైన ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు చేనేత రంగానికి చేయూతను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో త్వరలో మెగా షోరూమ్‌లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటి ద్వారా ఇప్పటి వరకు ఆప్‌కాబ్ దగ్గర ఉన్న ఉత్పత్తులను రిబేటు ద్వారా విక్రయించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. చేనేత ద్వారా విశిష్టమైన, నాణ్యమైన ఉత్పత్తులు వచ్చే విధంగా వారిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు.

ఆశాజనకంగా వ్యవసాయ ఉత్పత్తులు..
బెంజిసర్కిల్, ఆగస్టు 1: రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఎడాది ఆశించిన దాని కంటే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఖరీఫ్‌కు అవసరమైన సాగునీరు లభించడంతో పాటు వర్షాలు సైతం సకాలంలో అనుకూలించడంతో రైతులు అనందంగా వ్యవసాయపనుల్లో పూర్తిగా నిమగ్నమైయ్యారని ఆయన చెప్పారు. సోమవారం నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎడాది ఇప్పటి వరకు 23 లక్షల హెక్టార్లలో వరి సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చారని తెప్పారు. రెండేళ్లతో పోల్చుకుంటే సుమారు 10 లక్షల హెక్టార్లు ఎక్కువన్నారు. అంచనాలకు అనుగుణంగా ఉత్పత్తులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రైతులకు అందిస్తున్న వ్యవసాయ ఇన్సురెన్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ రుణాలు లేని రైతులు డ్వాక్రా సంఘాల ద్వారా ఈనెల 2లోగా ఇన్యూరెన్స్‌కు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులు ఇన్యూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, అలాగే వ్యవసాయ రుణాలకు సంబంధించి రెన్యూవల్ కోసం బ్యాంకు అధికారులను ఒప్పించడం జరిగిందన్నారు. ఈనెల 17లోగా రైతులు వారి వ్యవసాయ రుణాలను రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. అధిక వర్షాలు, వరదలు, విపత్తుల సమయంలో ఇన్సూరెన్స్‌కు సంబంధించి క్లైయిమ్‌లను త్వరితగతిన అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్యూరెన్స్ కంపెనీలను ఒప్పించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి రైతులకు పంట నష్ట జరిగినట్లైతే డ్రోన్‌ల సహాయంతో విచారణ జరిపించి, 48గంటల్లోగా వారికి నష్టపరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. రైతులు దీనిని దృష్టిలో ఉంచుకుని వీటిని వినియోగించుకోవాలన్నారు.

పుష్కర భక్తుల కోసం
నగరంలో రూట్ మ్యాప్‌లు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 1: ప్రభుత్వం తీసుకుంటున్న ముందుచూపు చర్యలతో అప్పుడే నగరానికి పుష్కర కళ వచ్చేసింది. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో లైటింగ్ వేయటం పూర్తికావటంతో రాత్రిపూట నగరంలో రకరకాల లైటింగ్స్‌తో ప్రధాన కూడళ్లు వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీనికితోడు నగరంలో రోడ్లు కూడా వేయటంతో అం దంగా ముస్తాబయ్యాయి. నగరంలో ప్రధాన జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్‌తో కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏ రూట్ ఎటు వెళ్లాలో తెలుస్తుంది. నగరంలోని వివిధ రోడ్లు కలిసే కూడలిలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన రూట్ మ్యాప్‌లతో ఎవరు ఎటు డైవర్షన్ తీసుకుంటూ ఎటు వెళతారో తెలిసేలాగా ఏర్పాటు చేశారు. దీంతో నగరానికి వచ్చే పుష్క ర భక్తులకు ఉపయోగకరంగా ఉండేందుకు రూట్ మ్యాప్‌లను రోడ్లలోని కూడలిలో విజయవాడ మున్సిపల్ శా ఖ ఏర్పాటు చేసింది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పుష్కర భక్తులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఆ మార్గం ఎటు వెళుతుందో తెలుసుకునే వీలు ఏర్పడింది. దాంతో వారు ఏ ప్రాంతానికి వెళ్లాలో తెలుసుకుని సులభంగా అర్థం కావడానికి వీలు ఏర్పడింది.
ఏలూరు నుంచి వచ్చే భక్తులకు నగరంలోకి ప్రవేశించగానే కనిపించే విధం గా రామవరప్పాడు రింగ్ వద్ద రూట్ మ్యాప్‌తో బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఆ రూట్ మ్యాప్‌లో కనిపించే విధంగా సూచించే యారో మా ర్కు ద్వారా నగరంలో ఎటు కావాలంటే అటు వెళ్లే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. దాని తర్వాత అదే రూటులో వచ్చేవారికి కనిపించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ వద్ద మరో రూట్ మ్యాప్‌ను ఏర్పాటు చేయటం జరిగిం ది. దాని తర్వాత రమేష్ ఆసుపత్రి జం క్షన్ వద్ద కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ నుంచి బెంజిసర్కిల్ వర కు కూడా మ్యాప్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత వెళ్లే విధంగా కూడా రూట్ మ్యాప్‌లను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు చర్యలు తీసుకున్నారు. మచిలీపట్నం నుంచి నేషనల్ హైవే 65 నుంచి వచ్చే భక్తులకు కూడా తెలిసే విధంగా సిటీ జంక్షన్స్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. అదే విధంగా గుంటూరు నుంచి వచ్చే భక్తులకు సిటీలోకి ప్రవేశించగానే అర్థమ య్యే విధంగా రూట్ మ్యాప్‌లు ఏర్పా టు చేయటం జరిగింది. వారధి దగ్గరకు రాగానే కనిపించే విధంగా ఏర్పా టు చేశారు. అదే విధంగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు రాకుండానే అర్థమ య్యే విధంగా ఆ రూట్‌లో వచ్చే వారి కోసం అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. అదే విధంగా హై దరాబాద్ నుంచి నేషనల్ హైవే 65 నుంచి వచ్చేవారికి అర్థమయ్యే విధం గా ఇబ్రహీంపట్నం జంక్షన్ వద్ద ఏర్పా టు చేయటం జరిగింది. దాని తర్వాత వచ్చే జంక్షన్స్‌లలో కూడా ఎవరు ఎటు వెళ్లాలో తెలిసే విధంగా ఏర్పాటు చేయ టం జరిగింది. దాని ప్రకారంగా ఎవరు ఏ ఘాట్‌లకి వెళ్లాలి, లేకపోతే నగరం లో చూడదగ్గ ప్రదేశాలకు ఎటు వెళ్లా లో తెలిసే విధంగా ప్రభుత్వపరంగా ఏ ర్పాటు చేయటం జరిగింది. నగరంలో నాలుగు దిక్కుల నుంచి వచ్చే భక్తులకు అర్థమయ్యే విధంగా ప్రతి కూడళ్లలో రూట్ మ్యాప్‌లు ఏర్పాటుతో ఎవరిని అడిగే అవసరం లేకుండా రూట్ మ్యా ప్‌ల ద్వారా తెలుసుకుని వెళ్లే విధంగా ఏర్పాటు చేయటంతో భక్తుల ఇక్కట్లు చాలావరకు తీరే అవకాశం వుంది.