కృష్ణ

హోదా ఇస్తారని ఆశిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, ఆగస్టు 6: ఏపి ప్రజలు కాంక్షిస్తున్న ప్రత్యేక హోదాను కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ తప్పకుండా ఇస్తుందని బలంగా నమ్ముతున్నట్లు కేంద్ర ఐటి అంట్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల కారణంగానే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. శనివారం నగరంలోని హోటల్ మురళి ఫార్య్ఛున్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిత్రపక్షంగా ఉన్న టిడిపి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హోదా కోసం గట్టిగానే మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను లెక్క చేయకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు విమర్శించారు. మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసే క్రమంలో హోదాపై సరికొత్త నాటకానికి ప్రైవేట్ బిల్లు రూపంలో తెరలేపిందన్నారు. అప్పటి ప్రధాని హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. ఇప్పడు కుంటి సాకులు చెబుతూ ఎన్నికల నియమావళి అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందు క్యాబినెట్‌లో హోదా అంశాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శించారు. కొన్నిరోజులుగా జరిగిన పరిణామాలు, ప్రధానితో ఎంపిలు చర్చించిన అనంతరం హోదా తప్పకుండా వస్తోందని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మంత్రి మోడీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని, రాష్ట్రాన్ని తప్పకుండా అన్ని విధాలుగా అదుకుంటాని అని స్పష్టంగా చెప్పినట్లు ఆయన తెలిపారు. తాము మాత్రం హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ, లోటు బడ్జెట్‌కు నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు నిధులు వంటి సమస్యలను కేంద్ర ప్రభుత్వ త్వరితగతిన పరిష్కరించాలని ప్రధానికి వివరించినట్లు చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న టిడిపి గడిచిన రెండున్నరేళ్లలో కొంత సాధించగలిగాం అని అయితే కేంద్రం నుండి రాబట్టుకోవాల్సినవి చాలా ఉన్నట్లు చెప్పారు. దీనిని అనుసరించే కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై అవసరమైన సమయంలోఒత్తిడి తీసకువస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే రాజ్యసభలో టిడిపి ఎంపిలు పట్టుపట్టడంతో ఆర్థిక మంత్రి ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల ఉపయోగం, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంతో నయోనా, భయోనా సాధించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రతి పక్షాలు కలసి రావాల్సి ఉండగా వారి ఉనికి కోసం కొన్ని పార్టీలు వెంపర్లాడుతున్నట్లు చెప్పారు. ఖచ్చితంగా విభజన సమయంలోని చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇప్పుడు ఇచ్చిన హామీలను ప్రధాని మంత్రి, కేంద్ర ఎంత వరకు నిలబెట్టుకుంటుందో చూడాలని తెలిపారు.
కాంగ్రెస్ వల్లే ఈ కష్టాలు
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న మనోవేదన, కష్టాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన అనాలోచిన విధానాలు, నిర్ణయాలనే కారణమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ విమర్శించారు. చేసిన తప్పును సరిదిద్దుకునే రాజసభ్యలో వచ్చిన సమయంలో టిడిపి ఎంపిలతో కాంగ్రెస్ ఎంపిలు నేడు కలసి రాకపోవడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కేవలం ఎపికి మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అనాడు ప్రకటించిందన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎంపి కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారు.