కృష్ణ

బెజవాడకు పాత రోజులు రానివ్వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 14: డూండీ గణేష్ ఉత్సవ కమిటి వివాదంలో అరెస్టయిన పారిశ్రామిక వేత్త కోగంటి సత్యంకు బుధవారం బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఈయన ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ బెజవాడకు పాత రోజులు రానివ్వద్దంటూ ప్రకటించారు. ఎమ్మెల్యే బొండా ఉమ అదుపులో ఉంటే మంచిదన్నారు. ఇక తనపై అక్రమ కేసులు బనాయించిన పోలీసు కమిషనర్ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యునిగా ఉన్న సమయంలో కోగంటితో విభేదించిన మిగిలిన సభ్యులతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కోగంటి, అతని ఇద్దరు అనుచరులైన సూరిబాబు, సురేష్‌లపై మరో సభ్యుడు పారేపల్లి రాకేష్ ఈనెల 3న సూర్యారావుపేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో హత్యాయత్నం ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు కోగంటి సత్యంను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు గన్నవరం జైలుకు రిమాండు నిమిత్తం తరలించారు. కాగా.. సత్యం తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనల అనంతరం తీర్పు నిమిత్తం వాయిదా పడింది. ఈక్రమంలో పదివేల రూపాయలు చొప్పున ఇద్దరు జామీనుదారుల పూచీకత్తుపై సత్యంకు బెయిల్ మంజూరు చేస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్ నిరంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గన్నవరం జైలు నుంచి సత్యం విడుదలయ్యారు.
* ఎమ్మెల్యే ఉమ అదుపులో ఉండాలి : కోగంటి
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ అదుపులో ఉండాలంటూ కోగంటి సత్యం వార్నింగ్ ఇచ్చారు. లేకుంటే బెజవాడకు పాత రోజులొస్తాయని హెచ్చరించారు. బెయిల్‌పై విడుదలైన సత్యం నేరుగా జైలు నుంచి నగరానికి వచ్చారు. ఆయన్ను విడుదల చేయాలంటూ అలంకార్ సెంటర్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని తానే స్వయంగా రూ.60లక్షల ఖర్చుతో నిర్మించానని గుర్తు చేశారు. రెండు నెలలు అహర్నిశలు శ్రమించి గత ఏడాది కంటే మిన్నగా ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధపడుతుండగా కేవలం మూడు రోజులు ఉండగానే ఎమ్మెల్యే ఉమ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని మండిపడ్డారు. నగర పోలీసు కమిషనర్ మంచివారనుకున్నానని, కాని గణేష్ ఉత్సవాల విషయంలో ఆయన పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసు కమిషనర్ తీరు తనను బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గణేష్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం తనకు ఒక లెక్కకాదని, గంటలో 50వేల మందిని పోగు చేయగల సమర్థత తనకు ఉందన్నారు. సీపిపై నమ్మకంతోనే వౌనం వహించానన్నారు. గత ఏడాది 15లక్షల మంది భక్తులు వస్తే.. ఈ ఏడాది లక్షమంది కూడా రాలేదన్నారు. అరాచకాలను, రౌడీ రాజకీయాలను ప్రోత్సహించని చంద్రబాబు బొండాను ప్రోత్సహించడం బాధాకరమన్నారు. డూండీ గణేష్ వ్యవహారంపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేస్తామని చెప్పారు. అంతకుముందు ఆయన దీక్షా శిబిరంలో నిరసన చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, మాజీ డెప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్, మాజీ కార్పొరేటర్ మండాబి వెంకటేశ్వరరావు, ఆమ్ ఆద్మీపార్టీ నాయకులు పోతిన రామారావు, ఫణిరాజు, సహాని, బిజెపి నాయకులు తుమ్మల పద్మ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.