కృష్ణ

రైతులకు బీమాపై పూర్తి స్థాయి అవగాహన పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: రైతుల్లో బీమా ద్వారా జరిగే ప్రయోజనాలను పెంపొందించడంలోను, అవగాహన పెంచడంలోను క్షేత్రస్థాయి అధికారులు మెరుగైన పనితీరును చూపాల్సి ఉందని కలెక్టర్ బాబు ఎ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన ఖరీఫ్ - 2016పై వ్యవసాయ శాఖ అధికారులకు, ప్రణాళికా విభాగం అధికారులకు, బ్యాంకర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రణాళికా విభాగం సంచాలకులు డా.దక్షిణామూర్తితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ 2016 ఖరీఫ్ సీజన్ నుంచే పిఎం ఎమ్‌పివై బీమా పథకాన్ని రైతులకు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఐసిఐసిఐ లాంబార్డు ఏజెన్సీ ద్వారా బీమాని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలోని లక్ష మందికి పైగా రైతులు రూ.15 కోట్ల మేర బీమాను చెల్లించడం జరిగిందన్నారు. బీమా పొందని రైతులు ఇంకా జిల్లాలో 4 లక్షలకు పైగా ఉంటారన్నారు. విపత్కర, అనుకొని ఉపద్రవాల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. రాష్ట్భ్రావృద్ధి రేటులో వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా వచ్చే ఆదాయం ప్రధాన భూమిక వహిస్తుందన్నారు. జిల్లాలోని 10 ప్రధానమైన పంటలు పండిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. బహుళ పంటలు వేసే రైతులకు బీమా ప్రయోజనం కలిగేలాగా ఒక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళ్లేలా వ్యవసాయశాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పెసలు, కందులు, మిరప, పత్తి, వేరుశనగ, చెరకు వంటి ప్రధానమైన పంటలు రైతులు వేయడం జరుగుతుందన్నారు. వీటికి అదనంగా మరికొన్ని పంటలను సాగు చేస్తున్నారని, అంతర పంటలుగా బహుళ పంటలను వేయడం జరుగుతుందన్నారు. కేవలం 1.5 నుంచి 2 శాతం వరకు వచ్చే సాగు దిగుబడి మొత్తంలోని రాబడి నుంచి బీమా ప్రీమియాన్ని చెల్లించడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు జరిగిన బీమా చెల్లింపుల వివరాలను గ్రామస్థాయిలో రైతుల వద్దకు తీసుకువెళ్లి వారిలో బీమా వల్ల జరిగే ప్రయోజనాలపై అవగాహన పెంచి ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జూన్ 2016 నుంచి పిఎంఎఫ్‌బివై అమలులోకి వచ్చిందని ఆయన తెలిపారు. రైతులను సాగు చేసే దిశగా చైతన్యపరచేలా అదే సందర్భంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసేలా చొరవ చూపాలన్నారు. ప్రణాళికా విభాగం సంచాలకులు డా.దక్షిణామూర్తి మాట్లాడుతూ పసల్ బీమా యోజన కింద కృష్ణాజిల్లాలోని 1005 గ్రామాలను 702 యూనిట్లుగా గుర్తించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2856 సిసి ఎక్స్‌ఫర్‌మెంట్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 100 హెక్టార్లను ఒక యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ రైతులకు బీమా పట్ల అవగాహన కల్పించి ప్రీమియం చెల్లించేలా ఒక ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయాలని తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో రైతుల వివరాలతోపాటు వారు పండించే పంట తదితర అంశాల ప్రాతిపదికన సమన్వయ శాఖలతో కలిసి చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. పిఎంఎఫ్‌బివై ద్వారా వ్యవసాయాధికారులకు, ప్రణాళికా విభాగం ఉపసంచాలకులు కె కన్నబాబు పూర్తి స్థాయి శిక్షణను అందించారు. ప్రభుత్వం భాగస్వామ్యంతో అది పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పంట బీమా పథకమని తెలిపారు. సిపివో రత్నబాబు మాట్లాడుతూ జిల్లాలో 32మంది సహాయ స్టాటిస్టికల్ అధికారులు, 18 మంది కాంట్రాక్టర్ ఎఎస్‌వోలు పని చేస్తున్నారన్నారు. మండల స్థాయిలోను అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎల్‌డిఎం జి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కౌలుదారులను గుర్తించడం జరిగిందని, సుమారు రూ.15కోట్లు బీమా ప్రీమియంగా వసూలు చేశామన్నారు. వ్యవసాయశాఖ డిడి బాలునాయక్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో 350 మంది వ్యవసాయాధికారులు పని చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ లక్ష్మీశా, డిఆర్‌వో సిహెచ్ రంగయ్య, జెడి ఎగ్రీకల్చర్ వెంకటేశ్వరరావు, ఆర్‌డివో డి సాయిబాబా, సిహెచ్ చక్రపాణి, డిడివో అనంతకృష్ణా, శ్యామ్‌సుందర్, బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు, ప్రణాళికా విభాగం అధికారులు పాల్గొన్నారు.
జి కొండూరు క్లెయిమ్ వెంటనే పరిష్కరించాలి
జి కొండూరు మండలంలో పంటకు ముందస్తుగానే జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి బీమా చెల్లింపులు జరపాలని కలెక్టర్ బాబు ఎ ఆదేశించారు. ఐసిఐసిఐ లాంబార్డ్ ప్రతినిధి పూర్తి వివరాలతో సమావేశానికి హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లాకు సంబంధించిన ఇన్‌చార్జి అధికారి హైదరాబాద్‌లో ఉండడంపై సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ కోరారు. రైతుల నుంచి తీసుకున్న బీమా ప్రీమియం వివరాలను అందుబాటులో ఉంచాలని, అదే సందర్భంలో బీమా ద్వారా చేసిన చెల్లింపుల వివరాలపై ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. అప్పుడే రైతులకు నమ్మకం పెరుగుతుందని తద్వారా వాటి ప్రయోజనాన్ని తెలుసుకోగలుగుతారని ఆయన తెలిపారు.