కృష్ణ

ఖాజీపేట నుంచి వచ్చే రైళ్లు 10వ ప్లాట్‌ఫారం మీదకు తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), సెప్టెంబర్ 21: ఆర్‌ఆర్‌ఐ (రూట్ రిలే ఇంటర్ లాకింగ్) సిస్టం ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలోనే ఎన్‌ఐ (నాన్ ఇంటర్ లాకింగ్) సిస్టమ్ ద్వారా 10వ నెంబర్ ప్లాట్‌ఫారం మీదకు ఖాజీపేట వైపు నుంచి విజయవాడ మీదుగా వచ్చే రైళ్లను 10వ నెంబర్ ప్లాట్‌ఫారం మీదకు తీసుకున్నారు. 21 నుండి 28 వరకు ఆర్‌ఆర్‌ఐ ఆధునికీకరణ పనుల దృష్ట్యా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్న సంగతి ప్రయాణికులకు తెలిసిందే. ఇందులో ప్రధానంగా 8, 9, 10 ప్లాట్‌ఫారాలు పైకి ఇప్పటి వరకు గూడూరు, గుంటూరు వైపు నుండి కృష్ణా కెనాల్ మీదగా ఈ మూడు ప్లాట్‌ఫారాల మీదకు చేరుకునేవి. అలాగే ఇటునుంచి నేరుగా అటు సికింద్రాబాద్ వైపు మాత్రమే వెళ్లడానికి వీలుగా కలిగి ఉన్న ఈ మూడు ప్టాట్‌ఫారాల మీదగా ఖాజీపేట, సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లను తీసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లను చురుగ్గా సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని రైళ్లను విజయవాడ మీదుగా నడపడం కోసం అందులో ముంబాయి, ఢిల్లీ, వారణాసి, సికింద్రాబాద్ వైపు నుంచి ఖాజీపేట మీదుగా విజయవాడ మీదగా వెళ్లే రైళ్లలో కొన్ని రైళ్లను 10వ నెంబర్ ప్లాట్‌ఫారం మీద నుంచి నడపడం కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇందుకు గతంలో ఉన్న పాయింట్ చేజింగ్‌కు కావాల్సిన నాన్ ఇంటర్ లాకింగ్ సిస్టం ద్వారా బుధవారం ఉదయం నుంచి 10వ నెంబర్ ప్లాట్‌ఫారం మీదుగా కృష్ణకెనాల్ నుంచి అటు గుంటూరు, ఇటు గూడూరు వైపు వెళ్లే రైళ్లను తీసుకోవడం ప్రారంభించారు. దీనితో 10వ నెంబర్ ప్లాట్‌ఫారం మీదకు సికింద్రాబాద్ వైపు వచ్చే రైళ్లు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆనందోత్సహాన్ని తెలుపుతున్నారు.