కృష్ణ

ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తవుతుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: కనకదుర్గపై వంతెన పనులు నత్తనడకగా జరగడం పట్ల కాంట్రాక్టర్లు, అధికారులపై కల్టెర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ సలోని సిదానా, డిఆర్‌వో సిహెచ్ రంగయ్య, ఆర్‌అండ్‌బి, పిఆర్, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యూఎస్, ఎన్‌హెచ్, ఇంజనీర్లు, సంబంధిత కాంట్రాక్టర్లతో దుర్గగుడి పైవంతెన పనులపై సమీక్షించారు. పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ పనులు జాప్యం పట్ల సహించేది లేదని కాంట్రాక్టర్లకు కలెక్టర్ స్పష్టం చేశారు. జనవరి, ఫిబ్రవరి మాసాలలో పవిత్ర సంగమం, పున్నమి, భవానీ ఘాట్స్‌లో ప్రపంచ స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగడం పట్ల కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. రోజువారి జరిగే పనులను ఫొటోల ద్వారా తనకు పంపాలని ముందుస్తుగా చేయాల్సిన పనులను క్రమబద్ధంగా చేయాలన్నారు. కాంట్రాక్టర్లకు పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ, కార్మికుల కొరత కారణంగా పనులు ఆలస్యంగా జరుగుతున్న విషయంపై కలెక్టర్ స్పందిస్తూ పని జరిగే చోట బ్యాంక్ ప్రతినిధులను నియమించి వారి దినసరి కూలీ చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ ఇంజనీర్లకు సూచించారు. ఏవో సాకులు చూపి పనులు ఆలస్యం చేయడం తీవ్రంగా పరిగణించడం జరుగుతుందన్నారు.
జనవరి మాసంలో 12,13,14న అంతర్జాతీయ ఎయిర్‌షో, అదే విధంగా జనవరి చివరిలో ప్రపంచస్థాయి సంగీత దినోత్సవం, ఫిబ్రవరి 10,11,12న జాతీయ మహిళా పార్లమెంటెరియన్‌ల సదస్సు జరగనున్నందున పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్లకు ఆదేశించారు. పనులకు సంబంధించిన తదితర అంశాలకు కావాల్సిన అనుమతులు కొరకు తన ద్వారా పైస్థాయి అధికారులకు ఉత్తరప్రత్యుత్తరాలు చేయాలని ఇంజనీర్లకు కలెక్టర్ సూచించారు.2

రోడ్డు ప్రమాదంలో
ఆటోడ్రైవర్ మృతి
* ఆగివున్న ఆటోపైకి దూసుకెళ్లిన లారీ
ఉయ్యూరు, నవంబర్ 23: మండలంలోని పెదఓగిరాల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. రూరల్ పోలీసుల కధనం ప్రకారం విజయవాడ వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టి అనంతరం రోడ్డు పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకువెళ్ళింది. ఈ దుర్ఘటనలో ఇంటి ముందు ఉన్న ఆటో మీదుగా లారీ దూసుకెళ్ళడంతో ఆటోతో పాటు అందులో కూర్చున్న ఆటోడ్రైవర్ మరీదు రాంబాబు(32) నుజ్జయ్యాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు రాంబాబును కాపాడేందుకు ప్రయత్నించి విఫలమైనారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసే జెసిబిని ఉపయోగించి ఆటోను, అందులోని డ్రైవర్‌ను వెలికి తీసారు. అనంతరం కొన ఊపిరితో ఉన్న రాంబాబాను విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సర్కారు బడుల్లో సగర్వంగా విద్యాబోధన
తోట్లవల్లూరు, నవంబర్ 23: తమ బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రయోజకుడయ్యాడని తల్లిదండ్రులు పదిమందికి గర్వంగా చెప్పుకునేలా సర్కారు పాఠశాలలు నడవాలని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. మండలంలోని గరికపర్రు ఎంపియుపి పాఠశాలలో సూరపనేని రామారావు మోమోరియల్ మండల స్థాయి విద్యా విషయక పోటీలు డాక్టర్ సూరపనేని శ్రీ్ధర్, సూరపనేని పూర్ణమోహన్‌రావు సహకారంతో బుధవారం జరిగాయి. క్విజ్ టాలెంట్ టెస్ట్, తదితర పోటీలు నిర్వహించారు. క్విజ్ పోటీలో పెనమకూరు (నాగ్) విద్యార్థులు ప్రథమ, దేవరపల్లి (త్రిశూల్) విద్యార్థులు ద్వితీయ, తోట్లవల్లూరు (ఆకాష్), వల్లూరుపాలెం (పృధ్వీ) విద్యార్థులు తృతీయ స్థానాలు సాధించారు. వీరికి ఎమ్మెల్యే కల్పన, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా కల్పన మాట్లాడుతూ పూర్వం జెడ్పీ హైస్కూల్లో చదువంటే గర్వంగా చెప్పుకునేవారమని, కానీ ఈనాడు కార్పొరేట్ స్కూళ్లని అలా చెప్పుకుంటున్నారని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలోని పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి డిఇవో చర్యలు తీసుకోవాలని కోరారు. డిఇవో సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తోట్లవల్లూరును మోడల్ మండలంగా ఎంపిక చేశామని, దాతల సహకారంతో మంచి కార్యక్రమాలు చేపట్టటం హర్షణీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్ధులు పాల్గొంటే ఒక చిన్నమాట వారిలో స్ఫూర్తినింపి గొప్ప వ్యక్తులుగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకునే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని చెప్పారు. పనిచేయని వారందరికీ మెమోలు ఇవ్వటం సాధ్యంకాదని, ఉపాధ్యాయులే తమ పనితీరుని మెరుగు పరచుకోవాలని కోరారు. గరికపర్రు పాఠశాలకు డిజిటల్ తరగతి నిర్మించటమే కాకుండా క్విజ్ పోటీలకు ఆర్థిక సహకారం అందించిన సూరపనేని పూర్ణమోహన్‌రావుని సుబ్బారెడ్డి అభినందించారు. జెడ్పీటిసి సభ్యురాలు తాతినేని పద్మావతి, సర్పంచ్ ఎన్ రాజేంద్ర, ఎంఇవో జి కృష్ణదిలీప్, ఎంపిడివో ఎస్‌ఈ పద్మసుధ, ఎంపిటిసి సభ్యులు ఆరేపల్లి శ్రీనివాసరావు, మూడే శివశంకర్, సర్వశిక్ష అభియాన్ ఎఎస్‌వో హైమేశ్వరరావు, దాత సూరపనేని పూర్ణమోహన్‌రావు, హెచ్‌ఎం కె రమాదేవి పాల్గొన్నారు.

జిల్లా వినియోగదారుల ఫోరం
చైర్మన్‌గా మోహనరావు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 23: జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి పి మోహనరావు నియమితులయ్యారు. గతంలో మచిలీపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన మోహనరావు పదోన్నతిపై పలు జిల్లాల్లో జిల్లా న్యాయమూర్తి స్థాయిలో సేవలు అందించి ఇటీవల పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన్ని జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈమేరకు బుధవారం మోహనరావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావును మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు మోహనరావు విలేఖర్లకు తెలిపారు.

హత్య కేసులో నిందితుల అరెస్టు
నందిగామ, నవంబర్ 23: ఇటీవల పట్టణంలో జరిగిన రిటైర్డ్ ఎఎస్‌ఐ గుంజి వెంకటేశ్వరరావు హత్య కేసులో ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు నందిగామ డిఎస్‌పి ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హత్య కేసు నిందితులను చూపి వివరాలు వెల్లడించారు. ఆస్తి వివాదాల నేపధ్యంలో రిటైర్డ్ ఎఎస్‌ఐ గుంజి వెంకటేశ్వరరావును ఈ నెల 15న కత్తులతో దాడి చేసి హత్య చేశారన్నారు. హతుడు వెంకటేశ్వరరావుకు వారసత్వంగా రైతుపేట డౌన్‌లో వచ్చిన 82సెంట్ల భూమి (సుమారు 3 కోట్లు)లో తమకు వాటా ఉందని ముద్దాయిలు గొడవ పడుతూ వచ్చారని, ఈ నేపధ్యంలో వారు హత్య చేసినట్లు తెలిపారు. ఈ హత్య కేసులో గుంజి శ్రీనివాసరావు, గుంజి ఆదినారాయణ, గుంజి సత్యనారాయణలను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్న తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌హెచ్‌ఒ (ఇన్స్‌పెక్టర్) సత్యనారాయణ, ఎస్‌ఐ తులసీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.