కృష్ణ

జిల్లాలో ఇక నగదు రహిత లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 24: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం తర్వాత ఉత్పన్నమైన చిన్ననోట్ల సమస్యను పరిష్కరించడంలో కేంద్రం ఒకింత విఫలమైంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు చిన్ననోట్ల సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ (నగదు రహిత ఆర్థిక లావాదేవీలు)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏ ఒక్కరికీ చిల్లర సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మైక్రో ఎటిఎంల ద్వారా చిన్ననోట్ల సమస్యలను పరిష్కరిస్తున్నారు. బ్యాంక్‌ల నుండి కూడా అవసరం మేర చిన్ననోట్లను ప్రజలకు అందించేందుకు శతవిధాలా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో నగదు రహిత సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కలెక్టర్ బాబు.ఎ నడుం బిగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతను జోడించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మన్ననలు పొందిన కలెక్టర్ బాబు.ఎ మరోసారి తన సాంకేతిక పరిజ్ఞానంతో నగదు రహిత సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. వర్తక, వాణిజ్య సంస్థలు, టోకు, చిల్లర వ్యాపారులు తమ వ్యాపార నిర్వహణలో పోస్ (పాయింట్ ఆఫ్ సేల్) విధానం అమలుకు ఆయన చర్యలు చేపట్టారు. ఈమేరకు ప్రతిరోజూ బ్యాంకర్లు, వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ నగదు రహిత సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సేవలకు అవసరమైన ఈ-పోస్ డివైజ్‌లను సైతం అందుబాటులోకి తెచ్చారు. కరెంట్ ఎకౌంట్ ఉన్న ప్రతి వ్యాపారికి ఈ-పోస్ డివైజ్‌లను సంబంధిత బ్యాంక్‌ల నుండి ఉచితంగా అందిస్తున్నారు. జిల్లాలో 14వేల ఈ-పోస్ మిషన్లు ఆయా బ్యాంక్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. మరో వారం, పదిరోజుల్లో 60వేల డివైజర్లు జిల్లాకు రానున్నాయి. అలాగే బ్యాంక్ ఎకౌంట్ కలిగిన ప్రతి కార్డుదారునికి రూపే కార్డులు అందించనున్నారు. రూపే కార్డుల ద్వారా ప్రజలు ఇకపై నగదు రహిత కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. పోస్ మిషన్ల అమరికపై ప్రతిరోజూ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు. నగదు రహిత ఆర్థిక లావాదేవీల విషయంలో కృష్ణా జిల్లా దేశానికే ఆదర్శవంతంగా నిలిచేలా కలెక్టర్ బాబు.ఎ కృషి చేస్తున్నారు. ఆయన కృషికి తోడుగా అధికారులు కూడా రాత్రింబవళ్లు కష్టించి పని చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలను తు.చ.తప్పక అమలు చేస్తున్న ‘టీమ్ కృష్ణా’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన్ననలు పొందుతోంది.