కృష్ణ

నేడు పేదలకు అన్న, వస్తద్రానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, నవంబర్ 24: ఆధ్యాత్మిక శిఖరం, అలుపెరుగని అన్నదాత, భారత్ సేవక్త్న్ర, సమైక్య భారత్ స్వర్ణ పురస్కార్ గ్రహీత, సూఫీ మహనీయులు మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న చీమలపాడులోని ఎఎఎంటికే దర్బార్‌లో పేదలు, వితంతువులు, వృద్ధులకు అన్నదానం, వస్తద్రానం చేస్తున్నట్లు దర్బార్ ట్రస్ట్ కార్యదర్శి ఎండి ఖాజా మొహియుద్దీన్ తెలిపారు. గురువారం దర్బార్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బాబా జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా పేదల సేవలో తరించనున్నట్లు తెలిపారు. సుమారు వెయ్యి మందికి పైగా వస్త్రాలు, దుప్పట్లు దానం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదానం జరుగుతుందన్నారు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు, చీమలపాడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేస్తామన్నారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో 240 కిలోల భారీ కేక్‌ను బాబా కట్ చేసిన అనంతరం సందేశం ఇస్తారన్నారు. దేశ సమైక్యత, మతసామరస్యం, శాంతి సమైక్యతకు, సోదర భావానికి బాబా సందేశం వేదికగా నిలుస్తుందన్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా అనేక మంది ప్రముఖులు హాజరవుతారన్నారు. అందరూ పాల్గొని బాబా ప్రసాదాన్ని స్వీకరించి జయప్రదం చేయాలని ఖాజా మొహియుద్దీన్ కోరారు. జిఎం జాఫర్ సాదిఖ్, తాజ్ ఖాదర్‌బాబా, తదితరులు పాల్గొన్నారు.