కృష్ణ

‘బందరు‘ను అన్నింటా ముందుంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 27: గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన బందరు నియోజకవర్గాన్ని అన్నింటా ముందుంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మారుమూల గ్రామాల్లో సైతం పెద్దఎత్తున సిసిరోడ్లు నిర్మించినట్లు తెలిపారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా ఆదివారం మండల పరిధిలోని చిన్నాపురం, భోగిరెడ్డిపల్లి, నెలకుర్రు, యాదర, గుండుపాలెం, రుద్రవరం గ్రామాల్లో మంత్రి రవీంద్ర విస్తృతంగా పర్యటించారు. చంద్రన్న బాట పథకం కింద చిన్నాపురం ఎన్టీఆర్ కాలనీలో రూ.26లక్షల వ్యయంతో అంతర్గత రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భోగిరెడ్డిపల్లి గ్రామంలో రూ.5లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. నెలకుర్రులో రూ.5లక్షలతో, ఎస్‌ఎన్ గొల్లపాలెంలో రూ.5లక్షలతో, గుండుపాలెంలో రూ.5లక్షలు మార్కెట్ యార్డు నిధులతో నిర్మించనున్న సిసిరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో బందరు నియోజకవర్గ అభివృద్ధికి చరమ గీతం పాడారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా వెయ్యి కోట్ల మేర అభివృద్ధి పనులు నిర్వహించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పర్చి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులను రెండేళ్ళల్లో పూర్తి చేస్తామన్నారు. గుండేరు డ్రైన్‌పై రూ.27.5కోట్లతో వంతెన నిర్మాణం, రూ.10.50కోట్లతో శారదానగర్-చిన్నాపురం డబుల్ లైన్ రోడ్డు పనులు, రూ.64కోట్లతో భవానీపురం వంతెన నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. రూ.15లతో చంద్రన్న బీమా పథకం కింద 10లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుల వృత్తులు, చేతి వృత్తిదారులను ప్రోత్సహించేందుకు గాను 12 కులాలకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్పొరేషన్‌ల ద్వారా అర్హులైన వారికి లక్షలాది రూపాయలు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, పార్టీ నాయకులు కుంచే నాని, రాజులపాటి సత్యనారాయణ పాల్గొన్నారు.