కృష్ణ

నగరంలో ‘తేజ’లకు నో ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 29: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆటోల వేగానికి బ్రేక్ పడనుంది. ఆటోడ్రైవర్ల తప్పిదాలతో నిత్యం చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించేందుకు నగర పోలీసు శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పక్కా ప్రణాళిక రచించింది. ఎంతోమంది ప్రయాణికులు ఆటోడ్రైవర్ల నిర్లక్ష్య వైఖరితో ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్ర గాయాలతో జీవితాంతం వికలాంగులవుతున్నారు. దీని దృష్ట్యా ఆటో ప్రమాదాలను నివారించేందుకు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ నడుం బిగించారు. ఈయన ఆదేశాల మేరకు ఇప్పటికే ట్రాఫిక్ శాఖ ఆర్టీసి, ఆర్టీఓ, విజిలెన్స్ శాఖలతో ఓ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఆటో ప్రమాదాలపై చర్చించారు. నగర ట్రాఫిక్ డిసిపి కాంతి రాణా టాటా పర్యవేక్షణలో సమావేశం కొనసాగగా ముఖ్యమైన ఆదేశాలు జారీ చేస్తూ ఆటో ప్రమాదాలను నిలువరించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ముందుగా ఆటో యూనియన్ల సహకారం కోసం మంగళవారం ట్రాఫిక్ డిసిపి కాంతా రానా టాటా తన కార్యాలయంలో ఆటో యూనియన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి యూనియన్లతోపాటు, ఆటోడ్రైవర్లతో మున్సిపల్, రవాణా, పోలీసు శాఖలకు చెందిన అధికారులు సమాలోచనలు జరిపారు. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు యూనియన్ల నుంచి కూడా సానుకూల స్పందన వెలువడింది. దీంతో ఇక ఆటోడ్రైవర్ల దూకుడుకు కళ్ళెం వేయనున్నారు. దీనిలో భాగంగా ప్రధానంగా అనుమతి లేని తేజా ఆటోలు నగరంలోకి రాకుండా కట్టుదిట్టం చేయనున్నారు. ఇదే సమయంలో ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించిన ఆటోల్లో ఓవర్ లోడింగ్, డ్రైవర్ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టడం, పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడమే కాకుండా ఆటో సీట్ల వెనక వైపు కూడా కూర్చోబెట్టడం వంటి అంశాలపై ఉక్కుపాదం మోపనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆటోడ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు శాఖకు యూనియన్ల సమ్మతి ప్రకటించింది. దీనిలో భాగంగా పోలీసు, రవాణా శాఖ అధికారులు డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆటో ఓవర్ లోడింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా నగరంలో ఆటోస్టాండ్లు పెట్టుకోవాలనుకునేవారు తప్పనిసరిగా మున్సిపల్, పోలీసు అనుమతి పొందాలని సూచించారు. సమావేశంలో ఆటోడ్రైవర్లు లేవనెత్తిన సందేహాలను ఆర్టీఏ పురందేర్ నివృత్తి చేశారు. సమావేశానికి ట్రాఫిక్ అదనపు డిసిపి టివి నాగరాజు, ట్రాఫిక్ ఏసిపిలు, ఇతర ట్రాఫిక్ అధికారులు, కార్పొరేషన్ అసిస్టెంట్ సిటి ప్లానర్-1 సురాజ్, అసిస్టెంట్ సిటి ప్లానర్-2 బోసు తదితరులు హాజరయ్యారు.
‘బినామీ’ కేసులో నిందితులను వదలం
* డిసిపి జి పాలరాజు
పాతబస్తీ, నవంబర్ 29: పాతబస్తీలోని గాంధీజీ మహిళా కళాశాల యాజమాన్యం బినామీ పేర్లతో ఖాతాలు ఓపెన్ చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయిందని ఈ కేసులో నిందితులపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నామని నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ జి పాలరాజు మంగళవారం రాత్రి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో వెల్లడించారు. మహిళా లెక్చరర్ కడియం జూడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళాశాల కరస్పాండెంట్ సిఎల్ కాంతారావు, ప్రిన్సిపాల్ రమణశ్రీ, గుమస్తాలు సుబ్బారావు, కుమార్ 406, 409, 420, 120 రెడ్ బి సెక్షన్లు నమోదు చేశామని ఆయన తెలిపారు. మహిళా కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతాలున్నాయి. సిబ్బంది జీతభత్యాల లావాదేవీలు ఆ బ్యాంక్‌లోనే జరిగేవి. ఈ నెల 10న కొత్తగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో మొత్తం 43 మంది సిబ్బందికి ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాలు తెరిచే ముందే కళాశాల యాజమాన్యం తెల్ల కాగితాల మీద విత్‌డ్రాయల్ ఫారాల మీద సంతకాల పెట్టించుకుంది. మొత్తం 12 లక్షలు నగదు 43 ఖాతాల్లో జమైంది. ఆ విషయం ఖాతాదారులకు తెలియదు. రూ. 6 లక్షల విత్‌డ్రాలు జరిగాయి. ఆ విషయం ఖాతాదారులకు తెలియదు. బ్యాంక్ నుండి వచ్చిన మెసేజ్‌లను గమనించిన కొంతమంది కళాశాల యాజమాన్యాన్ని నిలదీయడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. వీరిలో కడియం జూడీ అనే మహిళా లెక్చరర్ కరస్పాండెంట్ సిఎల్ కాంతారావుని గట్టిగా నిలేసింది. ఇలాంటి కళాశాలలో తాను పనిచేయనని తన సర్ట్ఫికెట్లు తనకు ఇమ్మని అడిగింది. సర్ట్ఫికెట్లు ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెట్టడంతో గత శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ విషయంలో ప్రాథమిక దర్యాప్తు చేపట్టగా కళాశాల యాజమాన్యం బినామీ ఖాతాలు బట్టబయలయ్యాయి. దాంతో సిపి ఆదేశాల మేరకు డిసిపి పాలరాజు ఆధ్వర్యంలో వెస్ట్‌జోన్ ఎసిపి జి రామకృష్ణ, ఇన్‌చార్జి సిఐ దుర్గారావు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జరిగిన సంఘటనపై తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజర్ పాత్రపై సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నామని ఆధార్ కార్డు, పాన్ కార్డులతో ఖాతాదారులు స్వయంగా బ్యాంక్‌కు వచ్చి ఖాతాలు తెరవాల్సి ఉండగా ఈ 43 మంది బ్యాంక్‌కు రాకుండానే ఖాతాలు తెరవడం దానికి సహకరించిన మేనేజర్‌పై చర్య తీసుకోనున్నామని డిసిపి తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్‌పై కూడా చర్య తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయంపై పోలీసుల అదుపులో ఉన్న కాంతారావుని విలేఖర్లు ప్రశ్నించగా తన మీద ఎవరు కేసు పెట్టారో తనను ఎందుకు తీసుకొచ్చారో తెలియదని చెప్పడంతో పోలీసులు అయోమయానికి గురయ్యారు. ఈ కేసులో ఎకౌంటెంట్ సుబ్బారావు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు.