కృష్ణ

నగదు రహిత లావాదేవీతో చౌకడిపోల ద్వారా విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: చౌకధరల దుకాణాల డీలర్లు నగదు రహిత లావాదేవీలతో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని జిల్లా కలెక్టర్ బాబు ఎ అన్నారు. మంగళవారం స్థానిక గాంధీనగర్‌లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో నగదు రహితంగా పిడిఎస్ ద్వారా సరుకులు పంపిణీ విధానంపై విజయవాడ, నూజివీడు డివిజన్ల పరిధిలోని డీలర్లకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ-పోస్) విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నామన్నారు. ప్రస్తుతం అమలుచేస్తున్న ఇ-పోస్ మిషన్లకు కొత్త వెర్షన్‌తో కొద్దిపాటి మార్పులు చేసి నగదు రహిత చెల్లింపులు నిర్వహించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. నూతన విధానంలో కొత్తగా జన్‌ధన్ బ్యాంకు ఖాతాలను ఇ-కెవైసి పద్ధతిలో తెరవవచ్చునని, నగదు బదిలీ, స్టేట్‌మెంట్ వంటి పలు కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని అన్నారు. డీలర్లు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ బిజినెస్ కరస్పాండెంట్లుగా, బ్యాంకు మేనేజర్లుగా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత కరెన్సీ సంక్షోభంలో నోట్లు, చిల్లర సమస్యలు లేకుండా కొద్దిపాటి మార్పులతో నగదు రహిత చెల్లింపులు నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఆధార్, బ్యాంకు ఖాతాలను ఎన్‌పిసిఐతో అనుసంధానించి 108 బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 11 లక్షల 88 వేల రేషన్ కార్డులు ఉండగా వీటిలో 10 లక్షల 67 వేలకు పైగా కార్డులు ఆధార్, ఎన్‌పిసిఐతో యాక్టివేట్ అయి ఉన్నాయన్నారు. ఐదు నెలల నుండి ఆధార్‌తో 10 లక్షల రేషన్ కార్డులలో 9.50 లక్షల రేషన్ కార్డుదారులు సరుకులు తీసుకువెళ్లినట్లు గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంకా బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానించని వారి వివరాలు సేకరించి త్వరితగతిన యాక్టివేట్ చేయాలని కలెక్టర్ అన్నారు. ఆధార్‌తో ఎన్‌పిసిఐ యాక్టివేట్ అయినట్లు సాధారణ, స్మార్ట్ ఫోన్లు ద్వారా *99*99 హాష్‌తో తెలుసుకోవచ్చునని కలెక్టర్ వివరించారు.
జిల్లాలో 16 రోజుల్లో 2,700 కోట్లకు పైగా నగదు బ్యాంకుల్లో జమైందని, సుమారు 600 కోట్లు నోట్ల మార్పిడి, నగదు చెల్లింపులు జరిగాయన్నారు. జిల్లాకు 20 కోట్ల రూపాయల విలువైన కొత్త 500 నోట్లు వచ్చాయన్నారు. నగదు రహిత చెల్లింపులను చౌకధరల దుకాణాలలో నిర్వహిస్తూ డీలర్లు దేశానికే మన జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ కోరారు. గన్నవరం మండలం మర్లపాలెం డిపో డీలర్ 98 శాతం నగదు రహిత లావాదేవీలు నిర్వహించటం పట్ల జిల్లా కలెక్టర్ బాబు ఎ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు.
అవగాహనా కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బాలాజీ, జిల్లా పౌర సరఫరాల అధికారి వి.రవికిరణ్, విజయవాడ, నూజివీడు డివిజన్లకు చెందిన డీలర్లు పాల్గొన్నారు.