కృష్ణ

శరవేగంగా గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, నవంబర్ 29: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాలు శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని చెవుటూరు, వెంకటాపురం, కుంటముక్కల, గుర్రాజుపాలెం గ్రామాల్లో మంగళవారం జనచైతన్య యాత్రల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల నాయకులు మంత్రి ఉమకు ఘనస్వాగతం పలికారు. పలుచోట్ల మంత్రి ఉమ మాట్లాడుతూ పదేళ్ళ కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. వేంపాడు, జక్కంపూడి, నూజివీడు, కొండపల్లి, చెవుటూరు మేజర్ల ద్వారా గోదావరి జలాలను చింతలపూడి ఎత్తిపోతల పథకంతో మెట్టప్రాంతానికి పంపిణీ చేస్తామన్నారు. మహిళలు సుఖంగా ఉండేందుకు బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. వచ్చే జన్మభూమిలో రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించి ప్రజల ఇబ్బందులు తొలగిస్తున్నామన్నారు. సిఎం చంద్రబాబునాయుడు బ్యాంకర్లతో పలుమార్లు సమావేశమై పెద్దనోట్ల రద్దుపై తగు ఆదేశాలు ఇస్తున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు మంత్రి ఉమ వివరించారు. టిడిపి యువనేత కుందేటి శ్రీనివాస్, సర్పంచ్ సూరానేని సౌజన్య, యరమల సంజీవరెడ్డి, కేశన వెంకటేశ్వరరెడ్డి, యేరువ కోటిరెడ్డి, లంకా రామకృష్ణ, లంకా నాగేశ్వరరావు, లంకా లితీష్, సుకవాసి శ్రీహరి, వరికూటి శ్రీనివాసరావు తదితరులు మంత్రి ఉమను ఘనంగా స్వాగతించారు. ఎఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, వుయ్యూరు నరసింహారావు, గొల్లపూడి నళినీమోహన్, మంగలంపాటి వెంకటేశ్వరరావు ఎర్రబోలు నాగేశ్వరరావు పాల్గొన్నారు.