కృష్ణ

ప్రధాని ఏకపక్ష నిర్ణయంతో దేశంలో ఆర్థిక సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్/ నందిగామ, నవంబర్ 29: నల్ల ధనం అరికట్టే నెపంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఏకపక్ష నిర్ణయంతో రూ.500, రూ.1000ల నోట్లు రద్దు చేయడం వల్ల నేడు సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని, అన్ని రంగాలు, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిని దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని మాజీ కేంద్ర మంత్రి పళ్ళంరాజు విమర్శించారు. మంగళవారం నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తదుపరి జగ్గయ్యపేట మండలం గరుడాచల క్షేత్రం కొండ కింద జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కొత్త కరెన్సీని పూర్తిగా ముద్రించకుండానే పాత కరెన్సీని రద్దు చేయడం వల్ల బ్యాంకుల్లో, ఎటిఎంలలో నగదు లేక రోడ్లపై ప్రజలు పడిగాపులు కాస్తున్నారని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి దేశంలో లేదన్నారు. ఆర్థిక వేత్త, పదేళ్లు దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్యసభలో ప్రస్థావించినా కేంద్రం ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా ద్వారా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో పోరాడినా సరైన ప్రచారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల కష్టాలు, కాంగ్రెస్ పార్టీకే తెలుసునని, ఉపాధి హామీ పధకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టి పనులు లేక వలసలు పోతున్న వారికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. యుపిఎ ఫ్రభుత్వం 72వేల కోట్ల రుణ మాఫీ చేసిందని, రైతు రుణ మాఫీ పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైయ్యారని అన్నారు. ఎప్పటికైనా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నర్శింహరావు, జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళి, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలిలు తెలుగుదేశం ఫ్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నా సాగునీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులకు ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన వైఎస్ జగన్మోహనరెడ్డి డబ్బులు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు పొందిన కె పార్థసారది, సామినేని ఉదయభాను, శ్రీరాం రాజగోపాల్‌లు తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కర్నాటి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షరాలు సుంకర పద్మశ్రీ, ఎస్‌సి సెల్ విభాగం అధ్యక్షుడు విలాసబాబు, నియోజకవర్గ పరిశీలకుడు డేవిడ్‌రాజు, స్థానిక నాయకులు వాసిరెడ్డి బెనర్జీ, దాచేపల్లి వీరభద్రరావు, రేపాల మోహనరావు, ఆకుల బాజీ, చల్లా వైకుంఠరావులు పాల్గొన్నారు. నందిగామలో జరిగిన విలేఖరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలేటి సతీష్, డిసిసి ఉపాధ్యక్షుడు తలమాల డేవిడ్‌రాజు, పశ్చిమకృష్ణా రైతు విభాగం అధ్యక్షుడు యండ్రపల్లి నారాయణరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు జాఫర్ తదితరులు పాల్గొన్నారు.