కృష్ణ

మెట్రోరైల్ ప్రాజెక్టుకు భూసేకరణపై ఇకదృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైయ్యే భూసేకరణలో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలను గుర్తించి పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మెట్రో ప్రాజెక్టుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి నూతన రాజధాని ఏర్పాటులో భాగంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం తలపెట్టిన మెట్రో ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించటం జరిగిందన్నారు. సుమారు 1800 కోట్ల రూపాయల కోట్ల అంచనాలతో 25.60 కిలోమీటర్ల గల రెండు క్యారిడార్లు మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని సంబంధిత తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిడమానూరు నుండి ఏలూరు రోడ్డు మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు 13 కిలోమీటర్లలో క్యారిడార్, బస్టాండ్ నుండి బందరురోడ్డు మీదుగా పెనమలూరు వరకు 12 కిలోమీటర్లు నిర్మాణం చేపట్టటం జరుగుతుందన్నారు. చేపడుతున్న నిర్మాణం వెంబడి ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాల వివరాల ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదికలు తక్షణమే సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఓ సిహెచ్ రంగయ్య, సబ్‌కలెక్టర్ సలోని సిదాన, పెనమలూరు, విజయవాడ రూరల్ తహశీలాదర్ మదన్ మోహన్ పాల్గొన్నారు.