కృష్ణ

నగరంలో మొబైల్ ఎటిఎం వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: బ్యాంకు ఖాతాదారులు తమ నగదు లావాదేవీలను ఇంటివద్దనే చేసుకునే విధంగా మొబైల్ ఎటియం వాహనాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు ఎ తెలిపారు. బుధవారం కాళేశ్వరరావు మార్కెట్ ఆంధ్రా బ్యాంకు జోనల్ కేంద్రం వద్ద నాలుగు మొబైల్ ఎటియం వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోట్ల రద్దు నేపథ్యంలో ఖాతాదారులకు వెసులుబాటు కల్పించే విధంగా మొబైల్ ఎటియం వాహనాల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. ఆంధ్రా బ్యాంకు, ఓలా సౌజన్యంతో నాలుగు వాహనాలను ఒక్కొక్క వాహనంలో ఒక బిజినెస్ కరస్పాండెంట్ ఉణడే విధంగా వాహనాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అదేవిధంగా ఎటియం కేంద్రాళ ద్వారా నగదు లావాదేవీలు చేసే ఖాతాదారులకు మొబైల్ బ్యాంకింగ్ విధానాలు గురించి వివరించాలని కలెక్టర్ ఆంధ్రాబ్యాంకు అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు జిఎం దుర్గారాం, డిజియం కృష్ణకుమార్, ఎజియంలు భాస్కరన్ స్వామి, జోనల్ మేనేజర్ శశికుమార్, ఓలా ప్రతినిధి గడ్డం హరి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా జీతాలు
* ఎన్జీవో నేత అశోక్‌బాబు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీత భత్యాలను నగదు రూపంలో చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించి ఆర్థిక శాఖ అధికారులను ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగిందని ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్‌బాబు తెలిపారు. ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా జీతాలు చెల్లించేందుకు ఆర్థికశాఖ, బ్యాంక్ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన బుధవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గ్రామీణ మరియు ఏజెన్సీ ప్రాంతాలలో పని చేస్తున్న ఉద్యోగులకు బ్యాంక్ అధికారుల ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి జీతభత్యాలు నగదు రూపంలో చెల్లించాలని, పట్టణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు బ్యాంకుకు వెళ్లి నగదు పొందేందుకు ఒక రోజు కార్యాలయ సమయంలో రెండు నుండి మూడు గంటల పాటు అనుమతి మంజూరు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. సమస్యను ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి సూచన మేరకు బుధవారం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌కల్లాంను కలిసినట్లు తెలిపారు. సచివాలయం ఉద్యోగులతోపాటు ఇబ్రహీంపట్నం, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో శాఖాధికారుల కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలు హైదరాబాద్‌లో ఉన్నాయని, ఏటిఎంల ద్వారా నగదు పొందేందుకు ఉన్న ఇబ్బందిని గమనించి ఆయా ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. దీనిపై అజయ్‌కల్లాం స్పందించి వెంటనే కృష్ణాజిల్లా కలెక్టర్, బ్యాంకు అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా జీతభత్యాలు చెల్లించేందుకు తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, దీనిపై ఉద్యోగులుల ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. అవసరమైతే ఉద్యోగులకు రోజుకొక్క కేడర్ వారీగా నగదు రూపంలో జీతాలను చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని అజయ్‌కల్లాం తెలిపారని అశోక్‌బాబు తెలిపారు.

స్టేడియంలో అథ్లెటిక్స్ పండగ
* ఉత్సాహంగా కృష్ణా వర్సిటీ అథ్లెటిక్స్
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 30: వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈచాంపియన్‌షిప్ వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొ.ఎస్ రామకృష్ణారావు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల నుండి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈచాంపియన్‌షిప్‌లో కృష్ణా వర్సిటీ పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేయనున్నారు. ఈప్రారంభ కార్యక్రమంలో డిఎస్‌డిఓ సిరాజుద్ధీన్, వర్సిటీ స్పోర్ట్స్‌బోర్డ్ కార్యదర్శి డా ఎన్ శ్రీనివాసరావు, రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి ఎవి రాఘవేంద్ర, ఇంటర్నేషనల్ రిఫరీ రాజువెల్, కళాశాల చైర్మన్ నర్సిరెడ్డి, ప్రిన్సిపాల్ డా ఎస్ రాజు, టోర్నీ కార్యనిర్వహకకార్యదర్శి రాఘవ, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి. పురుషుల 10వేల మీటర్ల పరుగులో జె వెంకటేశ్వరావు(ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల), కె రాకెష్ (ఎజిఅండ్ ఎస్‌జి సిద్ధార్ధ), సిహెచ్ ఆశోక్ (డా జాకీర్ హుస్సెన్ కళాశాల)లు మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో కె మహదేవి, ఎం ఆదిలక్ష్మీ(ఎజిఅండ్ ఎస్‌జి సిద్ధార్ధ), టివి శ్రీవిద్య(వికాస్ కళాశాల)లు వరుసగా మూడు స్థానాలు సాధించారు. పురుషుల 800మీటర్ల పరుగులో జి రాములు, జె సందీప్, ఎ మునేంద్రకుమార్, మహిళల విభాగంలో ఎస్‌డి బాజిబీ, ఎన్ కవిత,సిహెచ్ పావని, షాట్‌ఫుట్ పురుషుల విభాగంలో ఎస్ వినోద్‌కుమార్, వి సురేష్, బి వెంకటరావు, మహిళల విభాగం ట్రిపుల్‌జంప్‌లో పి ఆదిలక్ష్మీ, ఎన్ ప్రశాంతి, డి భాను, పురుషుల వినాగంలో ఎన్ విజేంద్ర, డి రంజీత్‌భార్గవ్, డి వెంకటలక్ష్మణ్, 100మీటర్ల పురుషుల విభాగంలో ఎస్‌ఎస్‌వి రోహిత్, పిడి శ్రీనివాసరావు, శ్రీకాంత్, మహిళల విభాగంలో ఎల్ భాగ్యశ్రీ, ఎస్ రాధిక, ఎస్ జ్యోతి, హైజంప్ పురుషుల విభాగంలో కె అనిల్, కె కిషోర్, జె వెంకటేష్, మహిళల విభాగంలో పి ఆదిలక్ష్మీ, ఎస్‌కె బాజిబీ, ఎన్ రామ్య, పురుషుల జావెలీన్‌త్రోలో సిహెచ్ వెంకటరావు, బివివిఎఎస్ నాయుడు, డి సైదాబాబు, మహిళల హైమర్‌త్రోలో పి మాధవి, ఎల్ లక్ష్మీ, బి దుర్గ్భావానిలు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు.