కృష్ణ

నోట్ల మార్పిడి కేసులో 11మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 30: పెద్ద నోట్ల రద్దు అవకాశంగా తీసుకున్న కొంతమంది వ్యక్తులు నల్లధనాన్ని వైట్ కరెన్సీగా మారుస్తామంటూ రియల్ ఎస్టేట్ ఆఫీసును అడ్డాగా మార్చుకుని అక్రమాలకు పాల్పడే క్రమంలో నిందితులు 11మందిని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 7,200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఏసిపి సత్యానందం తెలిపారు. మాచవరం పోలీస్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేవినగర్‌కు చెందిన కన్నపు సంతోష్ రవికిరణ్ అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రితం కేదారేశ్వరరావుపేటకు చెందిన శృంగవరపు జగదీష్ (26) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు పెద్ద సర్కిల్ ఉందని, తన స్నేహితుల వద్ద రెండువేలు, వంద నోట్లు వైట్‌మనీ ఉందని, రద్దయిన 500, 1000 నోట్లు నల్లధనం తీసుకువస్తే 15శాతం కమిషన్ పద్ధతిపై మారుస్తానని నమ్మబలికాడు. దీంతో సంతోష్ రవికిరణ్ తన స్నేహితుడైన కొమ్మినేని అనిల్‌కుమార్‌కు తెలియచేశాడు. ఇద్దరూ కలిసి ఈనెల 29న జగదీష్‌కు ఫోన్ చేసి పార్టీ రెఢీగా ఉన్నాడని చెప్పడంతో చుట్టుగుంట బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు సమీపంలోని స్వదీప్ రియల్ ఎస్టేట్ ఆఫీసుకు రావాలని సూచించాడు. అక్కడకు వెళ్లగానే.. జగదీష్‌తోపాటు కుందావారి కండ్రికకు చెందిన ఒరుసు జాన్ అలియాస్ జానీ (40), కృష్ణలంకకు చెందిన శ్రీనివాసరావు, తాడేపల్లికి చెందిన బత్తుల శివనాగేశ్వరరావు (24), శిఖామణిసెంటర్‌కు చెందిన ఎం కృష్ణయ్య (51), సత్యనారాయణఫురానికి చెందిన ప్రభాకర్ (37), కృష్ణలంకకు చెందిన కాకర్ల ఫణికుమార్ (26), పటమటకు చెందిన రమణ శ్రీనివాసరావు (43), సింగ్‌నగర్‌కు చెందిన ఎం చైతన్య (25), అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఎన్ రవి (23), టి సంతోష్ (31)లు ఉన్నారు. వీరంతా కలిసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అనుమానం రావడంతో రవికిరణ్, అనిల్‌కుమార్‌లు అక్కడి నుంచి జారుకున్నారు. వెంటనే మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మీదట నిందితులు 11మందిని అరెస్టు చేసి వారి నుంచి 7,200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి తెలిపారు. విలేఖరుల సమావేశంలో మాచవరం సిఐ ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు