కృష్ణ

ప్రజా సంక్షేమానికే అహర్నిశలు పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, డిసెంబర్ 3: నియోజకవర్గ ప్రజలంతా తనను ఆశీర్వదించి నాడు గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రజాభీష్టాన్ని గౌరవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు వైద్య, ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి పదవిని ఇచ్చారని, వైద్య ఆరోగ్య శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి సర్కారు దవాఖానాలో పేదలందరికీ మెరుగైన వైద్యమందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి పలు ఆలయాల్లో శనివారం పూజలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చేనేత సంఘాలకు ఆర్థిక వెసులుబాటు
పెడన, డిసెంబర్ 3: చేనేత సహకార సంఘాల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించిందని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు వేణుగోపాలరావు, జిల్లా విభాగం అధ్యక్షులు భట్ట శివశంకరరావు తెలిపారు. శనివారం స్థానిక లక్ష్మీ కలంకారీ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ సహకార సంఘాలలో నూలుపై 20శాతం రాయితీ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. సంఘానికి 10శాతం, కార్మికునికి 10శాతం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. జిల్లాలో సంవత్సరానికి రూ.కోటి 20లక్షల ప్రయోజనాన్ని కార్మికులు పొందగోరుతున్నారన్నారు. రాయితీ నేరుగా కార్మికుని ఖాతాలోకి చేరుతుందని శంకరరావు తెలిపారు. 20శాతం రాయితీ రూపేణా టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3.50కోట్లు లభించిందన్నారు. అలాగే చేనేత రుణమాఫీ పథకం కింద రూ.1207 మందికి రూ.2కోట్ల 53లక్షలు రద్దు చేయటం జరిగిందన్నారు. త్వరలోనే రుణాలపై వడ్డీని కూడా మాఫీ చేయించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఇండియన్ బ్యాంక్ పరిధిలో మినహా మిగిలిన అన్ని బ్యాంకులు కూడా రుణమాఫీని అమలు చేశాయని తెలిపారు. ఈ సమావేశంలో చేనేత విభాగం రాష్ట్ర నాయకులు అనుముల పూర్ణ, సొసైటీ మేనేజర్ కట్టా మధు తదితరులు పాల్గొన్నారు.

న్యాయం కోరుతూ ఎఎన్‌ఎమ్ వౌన పోరాటం
కూచిపూడి, డిసెంబర్ 3: మొవ్వ పిహెచ్‌సి సబ్‌సెంటర్ ఎఎన్‌ఎం అబ్బూరి రత్నకుమారి ఫిర్యాదు మేరకు కూచిపూడి ఎస్‌ఐ పి సోమశేఖరరెడ్డి కేసు నమోదు చేసినట్లు చల్లపల్లి సిఐ వై వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రత్నకుమారి ఫిర్యాదును అవనిగడ్డ డిఎస్పీ సయ్యద్ ఖాదర్ భాషా దర్యాప్తు చేస్తారన్నారు. మొవ్వ పిహెచ్‌సి వైద్యులు డా. శొంఠి శివరామకృష్ణ, ఎఎన్‌ఎం మండవ కవిత, మెయిన్ ఎఎన్‌ఎం కటికల రామాంజనేయులు, అటెండర్ పోతార్లంక సత్యనారాయణ, సిబ్బంది కులుకుల చిట్టిబాబు, యుడిసి వంపుగళ్ళ సూర్యప్రకాశరావు తదితరులు రత్నకుమారిని డాక్టర్‌తో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోవాలని గదిలో పెట్టి బంధించి ప్రోత్సహించారని, అందుకు నిరాకరించినందుకు కులం పేరుతో దూషించారని రత్నకుమారి ఫిర్యాదు చేసిందన్నారు. నన్ను అవమాన పర్చారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, ఐదు నెలలుగా అధికారులు, సిబ్బంది క్షోభకు గురి చేస్తున్నారని మొవ్వ తహశీల్దార్ కార్యాలయం వద్ద తనకు న్యాయం జరిగే వరకు వౌనపోరాటం కొనసాగిస్తున్నట్లు ఎఎన్‌ఎం రత్నకుమారి విలేఖర్ల వద్ద వాపోయింది. కాగా రత్నకుమారిని బదిలీ చేయాలంటూ గత రెండు రోజులుగా డా. శొంఠి శివరామకృష్ణతో పాటు సిబ్బంది, ఎఎన్‌ఎంలు విధులను బహిష్కరించి తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో ఆశావర్కర్లు పాల్గొన్నారు. సిబ్బందికి, ఎఎన్‌ఎంకు జరుగుతున్న వివాదం తెలుసుకున్న డిఎంహెచ్‌ఓ నాగమల్లేశ్వరి ఆదేశం మేరకు అడిషినల్ డిఎంహెచ్‌ఓ డా. టివిఎస్‌ఎన్ శాస్ర్తీ, డిఐఓ డా. అమృతలతో పాటు ఎస్‌ఐ పి సోమశేఖరరెడ్డి విడివిడిగా ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లను ప్రశ్నించి లిఖిత పూర్వకంగా వారి నుండి సమాచారాన్ని సేకరించారు. పిహెచ్‌సి వైద్యులు డా. శొంఠి శివరామకృష్ణ తమ పట్ల ఏ నాడూ అసభ్యంగా ప్రవర్తించలేందంటూ ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు విడివిడిగా అడిషినల్ డిఎంహెచ్‌ఓకు రాత పూర్వకంగా తెలియపర్చారు. ఈ గందరగోళం పట్ల మొవ్వ ఇన్‌ఛార్జి తహశీల్దార్ బి బిక్షారావు తీవ్ర అసహం వ్యక్తం చేశారు.

స్వచ్ఛ్భారత్‌పై చైతన్య విద్యార్థుల ర్యాలీ

మైలవరం, డిసెంబర్ 3: స్వచ్ఛ్భారత్‌పై శ్రీ చైతన్య విద్యార్థులు శనివారం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక స్కూల్ వద్ద ర్యాలీని ఎస్‌ఐ రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ టి శేషుబాబు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల నివారణకు అవసరమైన విధానాలను అందరూ పాటించాలన్నారు. అదేవిధంగా కాలుష్య నియంత్రణకు అందరూ తోడ్పడాలన్నారు. ప్రతి చిన్న పనికీ వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. పలు ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన ప్లకార్డులతో చిన్నారులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఇన్‌చార్జ్ గురుప్రసాద్, డీన్ శాంసన్, పోలీసు సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.