కృష్ణ

ఫిబ్రవరి మొదటి వారానికి ఫ్లైఓవర్ పనులు పూర్తవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: కనకదుర్గ ఫ్లైఓవర్ మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఫిబ్రవరి మొదటి వారం నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమా కంపెనీ ఇంజనీర్లను ఆదేశించారు. భవానీపురం వద్ద కాస్టింగ్ యాడ్‌లో నిర్వహిస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌కు సంబంధించిన పనులను శనివారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లా కలెక్టర్ బాబు.ఎతో కలిసి పరిశీలించారు. పనులు పరిశీలించిన అనంతరం మంత్రి ఇంజనీరింగ్ అధికారులు, సోమా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుండి 3రోజులపాటు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును నిర్వహించడం జరుగుతుందన్నారు. సదస్సుకు దేశ విదేశాల నుండి 10మంది ప్రతినిధులు హాజరుకానున్నారన్నారు. నగరం నుండి ఇబ్రహీంపట్నం చేరుకునేందుకు ఫ్లైఓవర్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందుకు తగిన విధంగా ప్రణాళిక రూపొందించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తిచేసేలోపు కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా 249 మీటర్ల నిడివి గల మేజర్ బ్రిడ్జిని పూర్తిచేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి పనులను మరింతగా వేగవంతం చేయాలని నదీతీరం ప్రాంతం సంబంధించి రివర్ కాస్టింగ్, ఫైలింగ్ పనులను పూర్తిచేయడంపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పనులు పరిశీలనలో మంత్రి వెంట

షాపుల లీజు గడువులు పొడిగింపులకు
స్థారుూ సంఘం ఆమోదం
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 3: విజయవాడ నగరపాలక సంస్థ ఆధీనంలోని పలు షాపింగ్ కాంప్లెక్సులలో లీజుకాలం ముగిసిన పలు షాపులకు లీజు గడువులను మరో మూడేళ్లకు పెంచుతూ విఎంసి స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. ఈమేరకు శనివారం సాయంత్రం విఎంసి కౌన్సిల్ హాల్లోని స్థారుూ సంఘ సమావేశ హాల్లో నగర మేయర్, స్థారుూసంఘ చైర్మన్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన సంఘ సభ్యులు జి మహేష్, పైడి తులసి, డి జ్యోతి, వి హరనాథస్వామితోపాటు వివిధ శాఖాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో విఎంసి ఆధీనంలో ఉన్న ఎన్‌టిఆర్ షాపింగ్ కాంప్లెక్సు, అరండల్ మున్సిపల్ కాంప్లెక్సు, గోవిందరాజుల మార్కెట్, మహంతి మార్కెట్, సివిఆర్ కమర్షియల్ కాంప్లెక్స్, అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంకె బేగ్ షాపింగ్ కాంప్లెక్స్, మధురానగర్ షాపింగ్ కాంప్లెక్స్, రాజగోపాలాచారి మార్కెట్ కాంప్లెక్సు, దమ్మాలపాటి రామారావు కూరగాయల మార్కెట్, గరిమెళ్ల సత్యనారాయణ షాపింగ్ కాంప్లెక్స్-1,2, కృష్ణదేవరాయ షాపింగ్ కాంప్లెక్స్, రెహమాన్ పార్క్ కాంప్లెక్స్ లలో లీజు కాలం ముగిసిన వివిధ షాపులకు మరో మూడేళ్లపాటు లీజుకాలాన్ని పొడిగిస్తూ అధికారులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చర్చానంతరం ఆమోదించారు. అలాగే విఎంసి శానిటేషన్ వర్కర్లకు సరఫరా చేసే టవల్స్, చీరలు, చెప్పులు, కొబ్బరి నూనె తదితర వస్తులను సరఫరా చేసేందుకు పిలచిన టెండర్లలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న కాంట్రాక్ట్‌తోపాటు ప్రకాష్‌నగర్‌లోని కమ్యూనిటీహాల్ అద్దె లీజు టెండర్‌లో అత్యధికంగా కోడ్ చేసిన టెండర్‌దారునికి కాంట్రాక్ట్‌ను ఖరారు చేస్తూ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించారు. వీటితోపాటు విఎంసి ఉద్యోగులు విన్నవించుకొన్న వివిధ మెడికల్ బిల్లుల రీఎంబర్స్‌మెంట్, పెన్షన్ చెల్లింపులే కాకుండా విఎంసి ఖజానా నుంచి వివిధ పద్దుల కింద చేసిన జమా ఖర్చులకు ఆమోదం తెలిపారు.

పేదలకు వరం టాటా ట్రస్ట్ బీమా

విజయవాడ, డిసెంబర్ 3: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టాటా ట్రస్టు భాగస్వామ్యంతో పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) చేస్తున్న ప్రజాహిత సేవలు ప్రశంసనీయమని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. శనివారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి పద్మావతి కల్యాణ మండపంలో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన స్వస్థ్ కుటుంబం పేరిట స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రవేశపెట్టిన నూతన హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 265 గ్రామాల్లో స్టార్ ఇన్స్యూరెన్స్ సౌజన్యంతో టాటా ట్రస్టు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో నియోజకవర్గ పరిధిలో టాటా సంస్థ ద్వారా నియమితులైన ఇంటర్‌నెట్ సాథిల వలన నగదు రహిత లావాదేవీల పట్ల అవగాహన పరుస్తున్న తీరు అన్ని వర్గాల నుండి ప్రశంసలు వస్తున్నాయన్నారు. రతన్ టాటా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఆగస్టులో ఎంఓయు జరిగిన తరువాత పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో నూతన ఒరవడి కనిపిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 10 లక్షల జనాభాకు ఎన్టీఆర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వలన 3.5 లక్షల రూపాయలు లబ్ది చేకూరుతుందన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవలు కింద 2.5 లక్షల రూపాయలతో 1300 రకాల జబ్బుల చికిత్సకు అవకాశం వుంటే దీనితోపాటు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల అదనంగా ఒక్కో కుటుంబానికి లక్ష బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు.
టాటా ట్రస్టు ప్రతినిధి పవిత్రకుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సంసత్ ఆదర్శ గ్రామాల పిలుపు మేర విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని సారధ్యంలో 265 గ్రామాలు దత్తత తీసుకోవడం జరిగిందని టాటా ట్రస్టు ఇంత భారీఎత్తున ఎక్కడా చేపట్టడం జరగలేదని పేర్కొన్నారు. స్టార్ ఇన్స్యూరెన్స్‌కు చెందిన డా.ప్రకాష్ మాట్లాడుతూ 265 గ్రామాల్లో 10 లక్షల మంది ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ ద్వారా వైద్య సేవలు అందించి విజయవాడను నెంబరు ఒన్‌గా చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య, జిల్లా టిడిపి అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, మాజీ శాసనసభ్యులు స్వామిదాసు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పలువురు మార్కెట్ యార్డు చైర్మన్లు సాంబశివరావు, మల్లిఖార్జునరావు, తాళ్లూరి రామారావు, ధనేకుల సాంబశివరావు, జె.గోపాలకృష్ణ ప్రసంగించారు. అనంతరం స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రవేశపెట్టిన హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. అదే ప్రాంగణంలో ప్రజా పంపిణీ విధానంలో నగదు రహితంగా లబ్దిదారులకు మంత్రి బియ్యం పంపిణీ చేసారు.

అనధికార కట్టడాల తొలగింపు
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 3: ఎపి సిఆర్‌డిఎ రీజియన్ పరిధిలో ఉన్న అక్రమ, అనధికార భవన నిర్మాణాలు, లే అవుట్ల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆదేశాల మేరకు ప్లానింగ్ అధికారులు కృష్ణాజిల్లా పెనమలూరులోని భవనం సెల్లార్‌లో నిర్మించిన రెండు ఫాట్లతోపాటు గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని వేసిన అనధికార లే అవుట్‌ను తొలగించిన విషయం విధితమే. అనధికార లే అవుట్లపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించిన సిఆర్‌డిఎ అధికారులు ఈమేరకు తొలగింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఈసందర్భంగా శనివారం చేపట్టిన తొలగింపు చర్యల్లో కృష్ణాజిల్లా ఉయ్యూరు పరిధిలో 4ఎకరాల్లో వేసిన 3లే అవుట్లు, ఈడ్పుగల్లులో 1.70 ఎకరాల్లో వేసిన 2లే అవుట్లు, కాటూరులో 2.25 ఎకరాల్లో వేసిన ఒక లేఅవుట్ లను జోనల్ డెప్యూటీ డైరెక్టర్ కె నాగసుందరి, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ పివి రమణారావు,బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ వంశీకృష్ణలు, ఎడిఎం నాగమల్లేశ్వరి, సర్వేయర్ వెంకటేశ్వర్లు తొలగింపు చర్యలు చేపట్టారు.

జర్నలిస్టుల కబడ్డీ పోటీలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 3: విజయవాడ సిద్ధార్థ గ్రౌండ్‌లో రిపబ్లికన్ సర్వీసెస్ కబడ్డీ లీగ్ మొదటి రోజు విజయవంతంగా సాగింది. మొత్తం 19 టీమ్‌లు బాహీ బాహీ అంటూ మొదటి పూల్లో స్టేట్ రైడర్స్ టీమ్ సెమీ ఫైనాల్‌కు చేరింది. బి.పూల్లో ఇంద్రకీలాద్రి ఏరోస్ సెమీస్‌కు చేరింది. సిడి పూల్స్‌కు పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఫైనల్స్ జరుగుతాయి. తొలి రోజు కబడ్డీలీగ్‌ను మంత్రులు ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మేయర్ కోనేరు శ్రీ్ధర్, శాసన సభ్యులు బోడే ప్రసాద్, గద్దె రామోహనరావు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత మంత్రులు రెండు కోర్టులను ప్రారంభించారు. కాసేపు కబడ్డీ ఆడి అందరినీ అలకరించారు. మంత్రి కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాహేశ్వరావు, మీడియా మిత్రులతో కబడ్డీ ఆడటం అందరీని ఆకొట్టుకొంది. ఎంతో బిజీగా ఉండే మీడియా మిత్రులు ఇంత బాగా కబడ్డీ పోటీల్లో పాల్గొనటం, రిపబ్లిక్ సర్వీసెస్ ఎంతో చక్కగా ఏర్పాట్లు చేసిందని మంత్రులు పేర్కొన్నారు. ప్రతి జర్నలిస్ట్ కాస్తంత రిలీఫ్‌గా ఉంటే సమాజానికి మంచి జరుగుతోందన్నారు. ఈకార్యక్రమంలో సివిల్ సప్లయ్స్ కమిషనర్ రవిబాబు, సీనియర్ జర్నలిస్ట్ కృశ్చివ్, రిపబ్లిక్ సర్వీసెస్ ప్రతినిధులు నగేష్, మూర్తి, క్రాంతి కోనేరు, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు కెపి రావు పాల్గొన్నారు.

బంగారం జోలికొస్తే ఊరుకోం

విజయవాడ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు జరిగి 25 రోజులైనా సామాన్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావని ఇప్పుడు తాజాగా ఐటి శాఖ ప్రజలను మరో సంకట స్థితిలోకి నెట్టిందని, బంగారంపై పన్ను విధించడంపై ప్రజలు, గృహిణులు ఆందోళన చెందుతున్నారని ఏపి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె శనివారం నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కె.శ్రీలక్ష్మి, రాష్ట్ర మహిళా నాయకులు కుర్షీదా, జక్కుల ఇందిరా, దుర్గాదేవిలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాళిబొట్టు కూడా తెంచేస్తారా అని ఆవేశపూరితంగా మాట్లాడారు. మెడలో తాళిబొట్టు కూడా ఉండనివ్వరా ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల్ని రోడ్డు పాల్జేసిన బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఆడవారి నగలపై ప్రతి ఇంటింటి బంగారంపైనా కనే్నసిందన్నారు.

ఉత్సాహంగా కృష్ణా వర్సిటీ ఆర్చరీ పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 3: శాతవాహన కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల ఆర్చరీ పురుషుల, మహిళల చాంపియన్‌షిప్ శనివారం కళాశాల ఆవరణలో జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.వి.రవి పాల్గొని ప్రారంభించారు. ఈ చాంపియన్‌షిప్‌లో కృష్ణా విశ్వవిద్యాలయం ఆర్చరీ జట్లను ఎంపిక చేయడం జరిగింది. గుడివాడ ఎఎన్‌ఆర్ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాంటిస్సోరి మహిళా కళాశాల, పిబి సిద్ధార్థ కళాశాల, కెవిఎస్‌ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, శాతవాహన కళాశాలల జట్లు పాల్గొన్నాయి. 70మీటర్ల రికర్వ్ బాలుర విభాగంలో కె.పిచ్చయ్య (శాతవాహన కళాశాల), పి.గోపీచంద్ (ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల), ఎన్.పృథ్వీనాథ్ (ఎఎన్‌ఆర్ కళాశాల, గుడివాడ)లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. 50 మీటర్ల కాంపౌండ్ బాలుర విభాగంలో నవీన్‌కుమార్, ఇజిఎన్ దీపు, ఒవికె చైతన్య (ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల)లు మొదటి మూడు స్థానాలను సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డా.ఎన్.శ్రీనివాసరావు పాల్గొని విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నీ కార్యనిర్వాహక చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నాగేశ్వరశర్మ, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణ, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి, కళాశాల వ్యాయామ విద్యా సంచాలకులు బిసిహెచ్ సంగీతరావు, కళాశాల మేనేజర్ కె.శ్రీ్ధర్, వైస్ ప్రిన్సిపాల్ కె.వాసుదేవ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

రైతుబజార్లలో
మైక్రో ఎటిఎం సేవలు

విజయవాడ, డిసెంబర్ 3: రైతుబజార్లలో నగదు రహిత చెల్లింపులు నిర్వహించి చిల్లర కొరతను అధిగమించాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ బాబు.ఎతో కలిసి నగరంలోని స్వరాజ్ మైదానంలో గల రైతుబజారు మైక్రో ఎటిఎం సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను నిర్వహించి పెద్ద నోట్ల రద్దు వలన జరిగే అసౌకర్యాన్ని పరిష్కరించుకోవాలన్నారు. రైతుబజారులో మైక్రో ఏటిఎం ద్వారా ఆధార్ నెంబరుతో బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా వినియోగదారులకు చిల్లర నగదు అందించేలా ఏర్పాటు చేసామన్నారు. మైక్రో ఎటిఎంలలో నగదు డిపాజిట్, మినీ స్టేట్‌మెంట్, నూతన ఎకౌంట్ ప్రారంభం, నగదు బదిలీ వంటి పలు లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు.