కృష్ణ

అధికారుల పని తీరుపై ‘మండలి’ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, డిసెంబర్ 3: మోపిదేవి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నివేదికల ప్రకారం మోపిదేవి మండలం ఉపాధి హామీ పనుల నిర్వహణలో నాల్గవ స్థానంలో ఉందని, మరుగుదొడ్ల నిర్మాణంలో 3వ స్థానంలో ఉందని, ఏ ఒక్క పని సరిగా లేదని ఎంపిడిఓ బిఎం లక్ష్మీకుమారిని మందలించారు. ఉపాధి హామీ పథకం ఏపిఓ రవికుమార్‌ను మోపిదేవి మండలం 6వ స్థానంలో ఉందని, పని తీరును అభివృద్ధి పరిచి ప్రథమ స్థానంలోకి తీసుకురావాలన్నారు. అధికారులు కష్టపడి పని చేయాలని ఉద్బోధించారు. హౌసింగ్ డిఇ భానూజిరావు మాట్లాడుతూ సామూహిక గృహ నిర్మాణాలు మోపిదేవి, కళ్ళేపల్లి, వెంకటాపురం గ్రామాలలో అత్యధిక సంఖ్యలో మంజూరు చేశామని, లబ్ధిదారులు వెంటనే గృహ నిర్మాణాలను చేపట్టకుంటే వాటిని రద్దుచేసి వేరొకరికి ఆ గృహాలను కేటాయించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎంవి సూర్యనారాయణ, ఎంపిపి ఎం జయలక్ష్మి, ఎంఇఓ ఎంవి శేషగిరిరావు, పిఆర్ ఎఇ బ్రహ్మానందబాబు, హౌసింగ్ ఎఇ చలపతిరావు, అధికారులు, ఎంపిటిసిలు రావి రత్నగిరిరావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వి రవిచంద్ర, సర్పంచులు, కార్యదర్శులు, విఆర్‌ఓలు పాల్గొన్నారు.

తెలుగువారి సాంస్కృతిక రాజధాని బందరు
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 3: బందరు పట్టణం తెలుగువారి సాంస్కృతిక రాజధాని అని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక మహతి లలిత కళావేదికలో ఆంధ్ర సారస్వతి సమితి స్వర్ణోత్సవాలలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. బందరు పట్టణం కళలకు కాణాచి అన్నారు. తిరుపతి వెంకట కవులు అష్టావధానం చేసిన పుణ్యభూమి బందరు అన్నారు. సాహిత్యం, కళల ద్వారా సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. కవులు, గాయకులు, రచయితలు సారస్వతి సమితికి పూర్వ వైభవం సంతరింప చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రముఖ రచయిత, విమర్శకులు డా. అద్దేపల్లి రామ్మోహనరావు స్మారక చిహ్నం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సమితి స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం ప్రతిభావంతులైన సాహితీమూర్తులు అంపశయ్య నవీన్, ఎస్ నరసింహరాజు, ఎస్ లక్ష్మీనారాయణ, వి రాఘవరావు, శతావధాని డా. ఆర్ పార్వతీశ్వర శర్మ, వియోగిలను ఘనంగా సత్కరించారు. బి సత్యనారాయణ సింగ్, పి గంగాధరరావు, వారణాసి సూర్యకుమారిలకు జీవన సాఫల్య ప్రతిభా పురస్కారం అందించారు. సాయంత్రం జరిగిన చలమలశెట్టి నాంచారయ్య స్మారక సభలో నాంచారయ్య సాంస్కృతిక కళా రంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని సభాధ్యక్షుడు ఆంధ్ర సారస్వత సమితి పూర్వ అధ్యక్షులు జిసనారా అన్నారు.
సమితి కార్యదర్శి కొల్లూరి రామ్మోహనరావు జిసనారా స్మారకోపన్యాసం చేశారు. జిసనారా రచించిన సూక్తి రత్నావళి, సమితి అధ్యక్షుడు కొట్టి రామారావు రచించిన పడగనీడ నవలను ఆవిష్కరించారు. అనంతరం వివిధ అంశాలలో నిష్ణాతులైన వడ్డి కృష్ణమూర్తి, ఎ గోపినాద్, వి విద్యాధర్, సింహాద్రి పద్మ, పి వెంకటేశ్వరరావు, చలమలశెట్టి గాంధి, ఎస్‌వి రమణలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొట్టి రామారావు, ఎల్‌ఎస్ శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.