కృష్ణ

బందరు పోర్టుతోనే మచిలీపట్నం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 14: బందరు పోర్టుతోనే మచిలీపట్నం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మంత్రి రవీంద్ర బందరు మండలం చినకరగ్రహారం, పల్లెపాలెం, నవీన్ మిట్టల్ కాలనీలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణంతోనే మచిలీపట్నం అభివృద్ధి చెందుతుందన్నారు. పోర్టు నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకురావాలన్నారు. పోర్టుకు భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వనన్నారు. పల్లెపాలెంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమస్య వల్ల బల్బులు, టీవీలు, ఫ్యాన్లు మాడిపోతున్నాయని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన రవీంద్ర వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. చినకరగ్రహారం, నవీన్ మిట్టల్ కాలనీ ప్రజలు పక్కా గృహాలు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ప్రాధాన్యత క్రమంలో ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్, ఎంపిటిసి అయోధ్య, సర్పంచ్ జొన్నలగడ్డ పాండురంగారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్ ఎదుట రైల్వే సిబ్బంది ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 14: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ గుడివాడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద రైల్వే సిబ్బంది బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ ఎం లక్ష్మణరావు మాట్లాడుతూ రైల్వేలో క్లాస్ ఫోర్ సిబ్బందిపై అధికారులు చిన్నచూపుచూస్తున్నారని వాపోయారు. 7వ వేతన సంఘం రద్దు చేసిన అన్ని అలవెన్సులను పునరుద్ధరించాలని, రైల్వేలో అప్రింటిస్ చేసిన వారందరిని పర్మినెంట్ చేయాలని, రైల్వే విభాగాలలోని అన్ని ఖాళీలను భర్తీ చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మచిలీపట్నం స్టేషన్ మాస్టర్ పి నాగేశ్వరరావు, ఎం శ్యామసుందర్, సయ్యద్ అమీర్, ఓంకార్, గ్యాంగ్‌మెన్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.