కృష్ణ

2017 నాటికి దుర్గగుడికి నూతన శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జనవరి 30: రానున్న నూతన సంవత్సరం నాటికి విభిన్నమైన హంగులు, ఆర్భాటాలతో శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దుర్గగుడి ఇవో నరసింగరావు మాస్టర్‌ప్లాన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికితోడు భక్తులు అమ్మవారికి సమర్పించిన నగలు భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఒక ప్రదర్శనశాలను అమ్మవారి సన్నిధిలోనే ఏర్పాటు చేసేందుకు ఇవో నరసింగరావు రెండు, మూడు స్థలాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇంద్రకీలాద్రి విశిష్టత, స్థల పురాణం, వైభవం, మహిమలు భక్తుల కళ్లకు కట్టే విధంగా త్రీడీ ఎఫెక్ట్స్‌తోపాటు ఆధునీకమైన సౌండ్ సిస్టమ్స్‌ను సైతం జోడించి ఒక మరొక ప్రదర్శన శాల, ఆభరణాలు, విశిష్టత వివరించే కేంద్రం, రెండింటికి కలిసి ఒక ఆడిటోరియంలో ఏర్పాటు చేసే విధంగా ఈప్లాన్‌లో రూపొందించినట్లు తెలిసింది. సుమారు రూ.50కోట్ల అంచనాలతో మాస్టర్‌ప్లాన్ వేయించి రెండునెలల వ్యవధిలో పనులను ప్రారంభించటానికి ఇవో సిహెచ్ నరసింగరావు ఆలోచన చేశారు. ఈమాస్టర్‌ప్లాన్ ప్రకారం అమ్మవారి సన్నిధిలో చరిత్ర, ఆభరణాల ప్రదర్శనశాల, మాడవీధులు, అంతరాలయం, ఉపాలయాలు, పోటుశాల మాత్రమే కొండపై ఉండి మిగతా పరిపాలనా సంబంధమైన అన్ని కార్యాలయాలు కొండ కిందకు తెచ్చేందుకు ఏర్పాటు చేసినట్లుగా ఈ ప్లాన్‌లో రూపొందించినట్లు తెలిసింది. తిరుమల- తిరుపతి దేవస్థానం తరహాలో అమ్మవారి ఉత్సవాలను జరిగే సమయంలో మాఢవీధుల్లోనే ఉత్సవమూర్తులను ఊరేగించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దుర్గగుడిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయటానికి మాస్టర్‌ప్లాన్ ఒకటే శరణ్యమని ఇవో నరసింగరావు ఆలోచన చేసి ఈఅంశాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా సానుకూలంగా ఉండటంతోఈచర్యలు చేపట్టినట్లు సమాచారం.

సబ్‌ప్లాన్ నిధులు సద్వినియోగం చేసుకోవాలి
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 30: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్సీ, ఎస్టీల ప్రాంతాలను అభివృద్ధి పర్చేందుకు గాను ప్రభుత్వం విడుదల చేసిన సబ్‌ప్లాన్ నిధులను సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం మేయర్ తన ఛాంబర్‌లో టిడిపి ఫ్లోర్ లీడర్ జి హరిబాబు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బి నాగేంద్ర పుణ్యశీల తోపాటు నగర పశ్చిన నియోజకవర్గ కార్పొరేటర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ నగరం మొత్తం 19కోట్ల 74లక్షల 60వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందు నిమిత్తం పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ రూ.1.09కోట్లను మంజూరు చేసినట్టు వివరించారు. అలాగే సర్కిల్ పరిధిలోని తూర్పు నియోజకవర్గానికి రూ.9కోట్ల76 లక్షల 34వేలు రెండవ సర్కిల్ పరిధిలోని సెంట్రల్ నియోజవర్గానికి రూ.7 కోట్ల 63 లక్షల 16వేలను విడుదల చేసినట్టు మేయర్ వివరించారు. ఇందుకు సంబంధించి అభివృద్ధి పనులను చేపట్టుటకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.