కృష్ణ

మట్టిలో మాణిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల్లో మండలంలోని చెరువుమాధవరానికి చెందిన సపావత్ రామ్‌కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ సర్వీస్‌లో జిల్లా రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు. 2016లో దీనికి నోటిఫికేషన్ విడుదలవ్వగా, 2017లో పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 18న ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం రామ్‌కుమార్ చెన్నైలో ఇండియన్ పేటెంట్ అధికారిగా సేవలందిస్తున్నారు. కనీసం బస్సు సౌకర్యం కూడా సక్రమంగా లేని గ్రామంలో జన్మించి, ఆత్మవిశ్వాసం, తెలివితేటలతో, అకుంఠిత దీక్షతో జిల్లా రిజిస్ట్రార్‌గా ఎంపికవ్వడం విశేషం. ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంటెక్‌ను పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి తన అమ్మమ్మ బాణావత్ కోమిటి సంరక్షణలో పెరిగానని ఆయన తెలిపారు.

జగన్ సభకు వస్తే ‘జాగా’ సమస్య పరిష్కరిస్తాం
నూజివీడు, ఏప్రిల్ 19: ఈ నెల 21వ తేదీన జరిగే జగన్ సభకు వస్తే మున్సిపల్ పరిధిలోని ఎమ్మార్ అప్పారావుకాలనీలో పేదల ఇళ్ల స్థలాలకు న్యాయం జరిగేలా జగన్‌తో హామీ ఇప్పిస్తానని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. ఆయన నివాసంలో గురువారం ఎమ్మార్‌అప్పారావుకాలనీలో పట్టాలు ఇచ్చిన వారు, పొజిషన్‌లో ఉన్నావారితో సమావేశం నిర్వహించారు. ఇళ్ళ స్థలాల సమస్యపై తాను పోరాటం చేస్తునే ఉన్నానని, అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మార్ అప్పారావుకాలనీ, ఆర్‌ఆర్ పేటలలో 4వేల మందికి నివేశన స్థలాలు ఇప్పించామని నేటికి తెలుగుదేశం ప్రభుత్వం పోజిషన్ చూపించలేదన్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్ళ స్థలాల విషయంలో కొందరు టీడీపీ నాయకులు గతంలో కోర్టుకు వెళ్ళిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రజలు నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను గమనిస్తునే ఉన్నారని అన్నారు. రాబోయేది జగనన్న రాజ్యమని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరే సమయం వచ్చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు, పేదలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ఇళ్లకు ధరాఘాతం
లక్ష్యం చేరని గృహ నిర్మాణాలు: ఈఈ
కూచిపూడి, ఏప్రిల్ 19: గృహ నిర్మాణాల సామాగ్రి ధరలు ఒక్కసారిగా పెరగటంతో ఎంపికైన లబ్ధిదారులు భవన నిర్మాణాలకు ప్రోత్సహించి ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు కృషి చేయాలని గృహ నిర్మాణ శాఖ మచిలీపట్నం ఈఈ నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. మొవ్వ మండలంలో గృహ నిర్మాణాలపై పరిశీలించేందుకు గురువారం డీఇ రమేష్‌బాబుతో కలిసి మొవ్వ మండల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గృహాలను, కేంద్ర ప్రభుత్వం పీఎంఎవై పథకాలు ద్వారా బందరు డివిజన్‌లో 1774 గృహాలు మంజూరు కాగా 316 పూర్తయ్యాయన్నారు. గుడివాడ డివిజన్‌లో1509 మంజూరు కాగా 346 పూర్తయ్యాయన్నారు. కాగా అర్బన్ ఏరియాలైన మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, పెడన, విజయవాడ రూరల్, తిరువూరు, ఉయ్యూరు, జగ్గయ్యపేట నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో 25వేల గృహాలు మంజూరయ్యాయన్నారు. జీఫ్లస్-3, జీఫ్లస్-4 గృహాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాలను సేకరించి భవన నిర్మాణాలు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయన్నారు. సింగిల్ బెడ్‌రూమ్ గృహాలకు నెలకు రూ.500 చొప్పున చెల్లించాలని, రూ.4లక్షల 80వేలతో నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ గృహాలకు రూ.2.5లక్షలు సబ్సిడీగా చెల్లిస్తుందన్నారు. 455 చదరపు గజాల్లో భవనాలు నిర్మించుకొవల్సి ఉందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1100, గత ఆర్థిక సంవత్సరంలో 1100 గృహాలు మంజూరయ్యాయన్నారు. ఈ సమావేశంలో మొవ్వ ఎఇఇ ఎన్ మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.