కృష్ణ

విమానాశ్రయానికి భూములిచ్చేవారికి అమరావతిలో ప్లాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు అమరావతి రాజధాని ప్రాంతంలో జరీబు భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుందని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిపిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం 926 మంది రైతుల నుండి 1229 ఎకరాలు సేకరించాల్సి వుండగా 475 మంది రైతులు 494.22 ఎకరాలను ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. మరో 32 ఎకరాల భూమిని ఇవ్వడానికి మాజీ పార్లమెంట్ సభ్యుడు కృష్ణంరాజు ముందుకు రావడం జరిగిందని జెసి వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన మెట్ట రైతులకు 1000 చదరపు గజాల ఇంటి స్థలం, 200 చదరపు గజాల వ్యాపార కూడలి ప్రాంతంలో భూములను, జరీ భూముల రైతులకు 1000 చదరపు గజాల ఇంటి స్థలం, 450 చదరపు గజాల వ్యాపార కూడిలి ప్రాంతంలో భూములను ఇవ్వడం జరుగుతుందన్నారు. గన్నవరం విమానాశ్రయంలో భూములిచ్చిన రైతులకు 1000 చదరపు గజాల ఇంటి స్థలం, 450 చదరపు గజాల వ్యాపార కూడలి ప్రాంతంలో భూములను ఇవ్వడం జరుగుతుందన్నారు. భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇవ్వడానికి రైతులే ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. మిగిలిన రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారని గన్నవరంలో 9 గ్రామాలు, ఉంగుటూరులో 2 గ్రామాల పరిధిలో భూములను సేకరించడం జరుగుతుందన్నారు. భూముల క్రయ విక్రయాల లావాదేవీలపై ఎటువంటి అభ్యంతరాలు లేవని నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించుకోవచ్చని తెలిపారు. భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారికి 15 రోజుల్లో సంవత్సరపు కౌలు మొత్తం రూ.50వేలను వారి ఖాతాలకు జమచెయ్యడం జరుగుతుందన్నారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధిపరచిన భూములను ఇవ్వడం జరుగుతుందని ఆయన న్నారు. భూమి లేని నిరుపేదలకు రూ.2500 పింఛన్లను అందివ్వడం జరుగుతుందని నైపుణ్యంతో కూడిన శిక్షణను కూడా అందిస్తామన్నారు. ఇందుకోసం కొండపావులూరులో 15 ఎకరాల్లో శిక్షణా సంస్థను ఏర్పాటు చెయ్యడం జరుగుతుందన్నారు. పేద కుటుంబాలకు 25 లక్షల వరకు స్వయం ఉపాధి కొరకు వడ్డీలేని రుణాలను అందిస్తామన్నారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల నుండి మినహాయింపు నిస్తున్నామన్నారు. 365 రోజులు ఉపాధి హామీపథకం అమలు చేస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.