కృష్ణ

ప్రజా సాధికారత పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 20: పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రజా సాధికారిత సర్వే మరింత వేగవంతం చేయాలని, అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ ఆదేశించారు. గురువారం ప్రజా సాధికారిత సర్వే, స్వచ్ఛ్భారత్ మిషన్, ఆరోగ్యం, వనం-మనం, ఫైల్ మేనేజ్‌మెంట్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశానికి కృష్ణా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఇన్‌చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు బి రాజశేఖర్, ముఖేష్‌కుమార్‌మీనా, కర్నూలు జాయింట్ కలెక్టర్ పి హరికిరణ్, మున్సిపల్ కమిషనర్ వీర పాండియన్, సబ్ కలెక్టర్ జి సృజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజా సాధికారిత సర్వేను మరింత వేగంగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వాస్తవ లబ్ధిదారులకు చేరవేయడంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ పల్స్ తీరును ఆయన సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో సర్వే ప్రగతి సాధించకపోవడంపై జిల్లాల వారీ సమీక్షిస్తూ అనుకున్న సమయానికి సర్వే పూర్తి చేసేలా బాధ్యత తీసుకోవాలన్నారు. స్వచ్ఛ్భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ ఫైల్స్ సమీక్షిస్తూ జిల్లాల్లో 60 వేల ఫైల్స్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో 12,91,203 ఇళ్ళలోని, 46, 92 లక్షల జనాభా వివరాలను సర్వే ద్వారా చేపట్టల్సిన ఉందన్నారు. గ్రామీణ ప్రాంతంలో 81 శాతం, పట్టణ ప్రాంతంలో 52 శాతం పైగా సర్వే పూర్తి చేశామన్నారు. ఇప్పటివరకు 98 శాతం పైగా ఇళ్ళను సర్వే చేశామని, ఇంకా సమగ్రంగా చేపట్టాల్సిన ఉన్నందున అందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు ఆరోగ్యం, వనం - మనం, నీరు - చెట్టు కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం ఒకపూట, 4వ శనివారం క్షేత్ర స్థాయిలో జరిగే అవగాహన కార్యక్రమాల్లో ప్రతి ఒకరిని భాగస్వాములు చేయాలన్నారు. విద్యార్థులను సైతం భాగస్వాములుగా చేయాలన్నారు.