కృష్ణ

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగిరిపల్లి, నవంబర్ 17: ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ పిలుపునిచ్చారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఆగిరిపల్లిలో గురువారం జడ్‌పి చైర్‌పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో కృష్ణాజిల్లా రాష్ట్రంలో ముందుండాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి జలాలను తీసుకువచ్చి కృష్ణాజిల్లా సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రులు తమ వంతు కృషి చేస్తున్నారని చెప్పారు. నవ్యాంధ్ర రాజధానిని అభివృద్ధి చేసే క్రమంలో దేశ విదేశాల నుండి పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని అన్నారు. ఆయనకు అండగా ప్రతి కార్యకర్త నిలిచి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జీ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ సభ్యత్వాలు పెరిగే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చిట్నేని శివరామకృష్ణారావు, జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు గద్దె రఘుబాబు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు అట్లూరి రమేష్, మండల అధ్యక్షుడు మంగయ్య, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, నూతులపాటి నాగభూషణం, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
40 మంది టిడిపిలో చేరిక
పట్టణానికి చెందిన 13వ వార్డు సభ్యురాలు గంజినబోయిన ప్రభతో పాటు మరో 40 మంది ఈసందర్భంగా టిడిపిలో చేరారు. వారిని టిడిపి నాయకులు సాదరంగా ఆహ్వానిస్తు పచ్చ కండువాలు కప్పారు.