కృష్ణ

వైభవంగా స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, డిసెంబర్ 1: మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహా కుంబాభిషేక పూర్వక మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవ, గోపూజ, ఆలయ ప్రదక్షిణలు, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, తదితర పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, నవగ్రహ మండపారాధనలు, సుబ్రహ్మణ్య అనుష్ఠానం నిర్వహించారు. ఆలయ వేదపండితులు నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో చతుర్వేద పారాయణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బద్దు కుమార్ శర్మ స్వామివారికి పసుపు కుంకుమలతో కూడిన కానుకలను టిటిడి దేవస్థాన పండితులు జొన్నవిత్తుల వెంకట రామశర్మ దంపతులు స్వామివారికి అందచేశారు. సాయంత్రం అగ్నిప్రతిష్ఠాపన, అంకురారోపణ, అనుష్ఠానం, నిత్యహోమం, నీరాజన మంత్రపుష్పాలను భక్తులకు అందచేశారు. ఈ కార్యక్రమాలను చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసి ఎం శారదాకుమారి పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్టేట్ దేవాలయాల సూపరింటెండెంట్లు టి రామకృష్ణ, చెన్నకేశవ, విఎస్‌కె మల్లేశ్వరరావు, ఎ మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.

బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం
మైలవరం, డిసెంబర్ 1: జిల్లాలో బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం మోపినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్, ఇన్‌చార్జ్ డెప్యూటీ కమిషనర్ డివి సత్యప్రసాద్ హెచ్చరించారు. గురువారం ఆయన స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో విలేఖర్లతో మాట్లాడారు. బెల్ట్‌షాపుల నిర్వహణపై అనేక గ్రామాల నుండి తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని ద