కృష్ణ

నైతిక పరివర్తనతోనే ఎయిడ్స్‌కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, డిసెంబర్ 1: మన దేశం మహోన్నత సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, అలాంటి దేశంలో నైతిక విలువలు దూరం కావటంతో ఎయిడ్స్ వ్యాధి విజృంభిస్తోందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం దివిసీమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దేశంలో 21లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉండ గా మన నియోజకవర్గంలో 1150 మంది ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయన్నారు. కండోమ్ వాడండని చెప్పటానికి తాను వ్యతిరేకినని, నైతిక ప్రమాణాలతో జీవనం సాగించినప్పుడే ఇలాంటి వ్యాధులు రావన్నారు. ఏ రోగం వచ్చినా ముందుగా వైద్యులను సంప్రదించాలన్నారు. పర స్ర్తిలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని హితవు పలికారు. పడుపు వృత్తిని నివారించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎయిడ్స్ బాధితులకు మనోధైర్యం కల్పించాలని, పౌష్టికాహారం, యోగా చేయటం ద్వారా జీవన కాలాన్ని పెంచుకోవచ్చన్నారు. ఈవిషయంలో గ్రామీణ వైద్యులు గ్రామదేవతల మాదిరిగా వ్యవహరిస్తూ అనన్యమైన సేవలు అందిస్తున్నారని ఆయన అభినందించారు. కార్పొరేట్ వైద్యం వ్యవస్థను నాశనం చేస్తోందని, బతికేవారిని కొందరు చంపేస్తున్నారని, చనిపోయిన వారికి కూడా వైద్యం చేస్తున్నట్లు నటించే వైద్యశాలలు కూడా ఉండటం దురదృష్టకరమన్నారు. గ్రామాల్లో వైద్యసేవలు అందించడంలో ఆర్‌ఎంపిల పాత్ర ప్రశంసనీయమన్నారు. అంతకుముందు ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలు కళాశాలల విద్యార్థులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం చేయూత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో దాదాపు 200 మంది రక్తదానం చేశారు. కార్యక్రమానికి డా. పి శేషగిరిరావు అధ్యక్షత వహించగా సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత పున్నంరాజు, డా. ఉమాశంకర్, ఇళ్ళా రవి, తోట శ్యాంకిషోర్ నాయుడు, యాసం చిట్టిబాబు, బచ్చు వెంకటనాథ ప్రసాద్, జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, బి రమాదేవి, మత్తి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎస్‌ఎ పివోగా
ప్రసాద్‌బాబు బాధ్యతల స్వీకరణ
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 1: జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా కె దేవి వరమల్లిక ప్రసాద్‌బాబు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డెప్యూటీ ట్రజరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం ఇటీవల జిల్లా సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బదిలీ చేసింది. గురువారం ఎస్‌ఎస్‌ఎ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రసాద్‌బాబు 1991లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. తర్వాత సబ్ ఇన్‌స్పెక్టర్‌గా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతులు పొందారు. 2007లో గ్రూప్-1 ద్వారా ఖజానా శాఖలో ఎటిఓగా పనిచేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎడిగా, 2013 నుండి విజయవాడలో డిటివోగా పనిచేశారు. అనంతరం డిఆర్‌డిఏ అదనపు ప్రాజెక్టు అధికారిగా కూడా ప్రసాద్‌బాబు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ట్రజరీ శాఖలో డెప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది, ఫారిన్ సర్వీస్‌పై సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా జిల్లాకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్‌బాబును జిల్లా ట్రజరీ డెప్యూటీ డైరెక్టర్ నాగేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఎ కార్యాలయ అధికారులు, సిబ్బంది అభినందించారు.