కృష్ణ

భూములు ఇవ్వకుంటే కక్షసాధింపులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 1: బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూములు ఇవ్వడం లేదనే నెపంతో రైతుల పట్ల ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ధ్వజమెత్తారు. రైతుల నుండి బలవంతంగా భూములను ఎలాగైనా తీసుకునేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సాగునీరు ఇస్తే పంటలు పండి రైతులు ఎక్కడ భూములు ఇవ్వరోననే భయంతోనే పాలకులు పంట భూములను బీడుపెట్టారని విమర్శలు గుప్పించారు. గత మూడేళ్లుగా ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి గురువారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. స్థానిక మూడు స్తంభాల సెంటరు నుండి ప్రారంభమైన జగన్ రైతు భరోసా యాత్రకు ప్రజలు అడుగుడుగునా బ్రహ్మరథం పట్టారు. బందరు మండల పరిధిలోని బుద్ధాలపాలెం, కోన గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు రైతులు వేలాదిగా హాజరై ‘జై జగన్.. జైజై జగన్’ అంటూ నినదించారు. గత మూడేళ్లుగా వారు పడుతున్న బాధలు, పాలకులు పెడుతున్న ఇబ్బందులను జగన్‌తో మొరపెట్టుకున్నారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులు మరింత పోరాట పటిమతో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అంతా బడాబాబుల కోసమేనని ఆరోపించారు. రైతుల భూములను పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. నీకెంత.. నాకెంత? అనే ధోరణిలో చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. ప్రతిదానికీ కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుండి కమీషన్లు పుచ్చుకుంటూ అవినీతిని పెంచి పోషిస్తున్నారన్నారు. రైతులంటే చులకన భావంతో చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌తో రైతులను తీవ్రంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల క్రయ విక్రయాలను నిలిపివేయటంతో ఎంతోమంది రైతులు తమ పిల్లల వివాహాలకు, చదువులకు భూమిని అమ్ముకోలేని దుస్థితి నెలకొందన్నారు. బ్యాంక్‌ల్లో సైతం రుణాలు ఇవ్వడం లేదని, ఫలితంగా రైతులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణ విషయంలో అవసరానికి మించిన భూములను సమీకరిస్తున్నారని ఆరోపించారు. 5వేల ఎకరాల్లో 240 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం కలిగిన పోర్టును నిర్మించవచ్చన్నారు. కానీ ప్రభుత్వం 33వేల ఎకరాలను ప్రభుత్వం పోర్టు, పరిశ్రమల పేరుతో పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తోందని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. రాజధానిలో కూడా ఇలాగే మోసానికి పాల్పడిన ప్రభుత్వం తాజాగా బందరులో భూదోపిడీకి పాల్పడుతోందన్నారు. రైతులంతా సంఘటితం కావాల్సిన సమయం అసన్నమైందన్నారు. ఇప్పటివరకు చేసిన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భూ ఉద్యమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని జగన్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కెపి సారథి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను, వైకాపా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వైకాపా నాయకులు గౌతంరెడ్డి, దూలం నాగేశ్వరరావు, ఉప్పాల రాంప్రసాద్, సింహాద్రి రమేష్, షేక్ సలార్ దాదా, బొర్రా విఠల్, లంకే వెంకటేశ్వరరావు, మాదివాడ రాము, మోకా భాస్కరరావు, సిపిఎం నాయకులు కొడాలి శర్మ, సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు, తదితరులు పాల్గొన్నారు.