కృష్ణ

అక్రమ కేసుకు నిరసనగా విధులు బహిష్కరించిన వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, డిసెంబర్ 2: మొవ్వ పిహెచ్‌సి ఎఎన్‌ఎం అక్రమ కేసుకు నిరసనగా శుక్రవారం వైద్యులు డా. శొంఠి శివరామకృష్ణ, డా. భగవాన్, సిబ్బంది సాయంత్రం నుండి విధులను బహిష్కరించారు. మొవ్వ సబ్ సెంటర్ ఎఎన్‌ఎం ఎ రత్నకుమారిని వేరే పిహెచ్‌సికి బదిలీ చేయాలని లేదా తమను ఇతర ప్రాంతానికి బదిలీ చేయాలన్న విన్నపాన్ని పరిష్కరించాల్సిందిగా డియంహెచ్‌ఓ డా. ఆర్ నాగమల్లేశ్వరికి విజ్ఞప్తి చేసేందుకు శుక్రవారం సాయంత్రం మూకుమ్మడిగా విజయవాడ తరలి వెళ్లారు.
రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు మొవ్వ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు
కూచిపూడి, డిసెంబర్ 2: మొవ్వ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 1వతేదీన విజయవాడ ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోటీల్లో అండర్-17 బాలికల విభాగంలో పి పద్మావతి, జొన్నలగడ్డ శివ నాగకుమారి, కొమ్మురాజు, పెదపూడి రాధాకృష్ణ, అండర్-14 విభాగంలో జి అనన్య, కె శిరీష, జి ప్రణీత, జె రఘు తొలి మూడు స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని హైస్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం వెంకటేశ్వరరావు అభినందించారు.