కృష్ణ

ఘనంగా జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 2: జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె ప్రమీల మాట్లాడుతూ ప్లాస్టిక్ పెన్నులు, కవర్లు వాడకం వల్ల పర్యావరణానికి పెను ప్రమాదం వస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి చిన్నపనికీ వాహనాల వాడకం వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు. కాలుష్య నివారణకు చెట్ల పెంపకం మేలన్నారు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరిచేత పతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, కె మంజుల, శైలజ, ప్రవీణ్ దత్, నాగమణి, పలువురు అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం వార్షికోత్సవం
కూచిపూడి, డిసెంబర్ 2: తెలుగు భాషకు, లలిత కళలకు సేవలందిస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం కృషి ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు. విశ్వ విద్యాలయం 31వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక శ్రీ సిద్ధేంద్ర కూచిపూడి కళాపీఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూచిపూడి నాట్యవ్యాప్తికి విశేష సేవలందించిన నాట్య గురువులు కళావచస్పతి వేదాంతం పార్వతీశం, పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం, పద్మశ్రీ డా. వేదాంతం సత్యనారాయణ శర్మ, వేదాంతం రాఘవయ్య, భారత కళా ప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి, డా. చింతా రామానందంల కృషిని ప్రశంసించి నివాళులర్పించారు. కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగ శాస్ర్తీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైకెడి ప్రసాదరావు, సంజయ్, డా. చింతా రవిబాలకృష్ణ, వేదాంతం వెంకట దుర్గా భవాని తదితరులు పాల్గొన్నారు. నాట్యాచార్య వేదాంతం రాధేశ్యాంను ఘనంగా సత్కరించారు.