కృష్ణ

రూ.200లకే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, డిసెంబర్ 2: త్వరలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలకు కేవలం రూ.200లకే స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అధికారుల సమన్వయ లోపం కారణంగా అభివృద్ధిలో అవనిగడ్డ నియోజకవర్గం వెనుకబడుతోందన్నారు. జనరిక్ మందుల దుకాణాలను ఎందుకు మూయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రచార లోపం కారణంగా మూతబడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైపుణ్య, అభివృద్ధి శిక్షణ ఇచ్చే విషయంలో వెలుగు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కనకదుర్గ, జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ మండవ బాలవర్ధనరావు, ఎంపిడివో సునీతా శర్మ, తహశీల్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌సిసి, స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల ర్యాలీ
చల్లపల్లి, డిసెంబర్ 2: కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్‌ఆర్‌వైఎస్‌పి జూనియర్ కళాశాల ఎన్‌సిసి విద్యార్థులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ గ్రామ ప్రధాన రహదారుల వెంట సాగింది. ఈ ర్యాలీలో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్‌సిసి అధికారి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.